dhashamu bhaagamu lella dhaevuదశము భాగము లెల్ల దేవునివి ధారా
దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడి
పశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము
లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి ||దశమ||
1. దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది
నెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్
దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ ||దశమ||
2. పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ
భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు
దేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ ||దశమ||
3. ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుఁడీ
సదమల హృదయములను బొందియుఁ ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు
ముదమున దేవునికర్పించుఁడీ సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ
||దశమ||
4. ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ
కష్టఫలములను దీవింతును భీకర నాశంబుఁ దొలఁగింతును మీ కానంద
దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||
5. దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని
వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు
మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశమ||
dhashamu bhaagamu lella dhaevunivi DhaaraaLamuga niyya samakooduAOdi
pashuvulu pairulu dhaevunivi pasiAOdi loahapuganulu dhaevunivi bhaagyabhoagyamu
lella dhaevunivi bhaaviMchi kaanukalanu niyyuAOdi ||dhashama||
1. dhaevunivi dhoMgaliMchedharaa dhaevadhaevuni moasapuchchedharaa bhaaviMchi madhi
neMchi bhayamu neMchi praarDhiMpAO dhalavMchi prabhu bhaagamun
dhaevaalayMbunu poorNMbugaa dhaedheepyamugaa nuMda samakoorchuAOdee ||dhashama||
2. parishudhDha dhaevuni mMdhiramuAO paripoorNamugaanu yoachiMchuAOdee parishudhDha
bhaagamu vidAOdheeyuAOdee paadipMtalu naasthi dhaevunini padhiyava bhaagMbu
dhaevunivi paramaathma dheevenalanu boMdhuAOdee ||dhashama||
3. praThama phlMbulu dhaevunivi vidhithMbugaa neeya madhi neMchuAOdee
sadhamala hrudhayamulanu boMdhiyuAO praThama bhaagamu nella vidAOdheesiyu
mudhamuna dhaevunikarpiMchuAOdee sadhayu dheevenaloMdha samakoorchuAOdee
||dhashama||
4. aakasapu vaakiMdla vippudhunu aDhika krupalanu gummariMchudhunu mee
kaShtaphlamulanu dheeviMthunu bheekara naashMbuAO dholAOgiMthunu mee kaanMdha
dhaesha miththu nani shreekaruM dehoavaa sela vichchenu ||dhashama||
5. dhinabhoajanM bichchu dhaevunini ghana saukhyamula nichchu dhaevunini
vinayMbuthoa madhini DhyaaniMchuchu dhinabhoajanMbulanu bhaagiMchuchu
maanaka dhaevuni karpiMchu dee ghanasaeva jayamoMdhu pani boonadee ||dhashama||