aedhi sakhuda yaedhi nee madhiఏది సఖుడ యేది నీ మదిని జేసికొన
Chords: ragam: ముఖారి-mukhaari
ఏది సఖుడ యేది నీ మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను
కిదియె తరుణమీయరమ్ము ||
1. అన్న వస్త్రంబు లిచ్చి యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి
యున్న నా కెదురుకాను ||కేది||
2. వ్యాధి బాధలొదినపుడు శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం
బది యొసంగి యాదిరించితి ||ఏది||
3. మనసు శాంతిలేక నీవు మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ
జూపి కనికరించినట్టి ప్రభుని ||కేది||
4. పాపమందు పడినాడు దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి
యోపికతో నడుపలేద ||ఏది||
5. ఏమి దాచినావో సఖుడ! ఏమి తెచ్చినావు నేడు? నీ మనసు నిండ
ప్రేమయున్న నదియే నాకు వేనవేలు ||ఏది||