nuthi saeyanu laevae yoa manasనుతి సేయను లేవే యో మనసా నుతిఁజ
నుతి సేయను లేవే యో మనసా నుతిఁజేయను లేవే క్షితిని దివిని
హితమతిఁ బ్రోచెడి సుతుని జనకుని శుద్ధాత్మునిఁ ద్ర్యేకుని ||నుతి||
1. సూర్యుని కాంతి సొంపగు పంటలు సుకాలక్షేమముల్ శోభిలు
గేహమున్ ఆర్య సాంగత్యము నైశ్వర్యముల నిల ననుభవింపవె నీవా
యాఢ్యుని పేర్మిని ||నుతి||
2. దురితము లందె దుర్గతి నున్న నీ కురుతర ప్రేమను బరమార్థ
మీయను వరపుత్రు నొసఁగఁడె వందనీయుఁడు ప్రభు మరిమరి
మ్రొక్కు మా పరమోపకారిని ||నుతి||
3. జీవము జ్ఞానము జీవము నొసంగెడు పావనాత్మను నీకై పంపిన
దేవుడు కేవల దోష స్వ భావము మార్చఁడె సేవ జేయుమ నీవా
పావనమూర్తికి ||నుతి||
4. కరములు పదముల్ కనకాదు లన్నియు స్వరమును చిత్తము స్థిరమగు
ప్రేమయు మరి నీదు హృదయము పరమాత్ము సేవకై పరిపూర్ణముగ
నిచ్చి ప్రణుతించు మాయనన్ ||నుతి||
nuthi saeyanu laevae yoa manasaa nuthiAOjaeyanu laevae kShithini dhivini
hithamathiAO broachedi suthuni janakuni shudhDhaathmuniAO dhryaekuni ||nuthi||
1. sooryuni kaaMthi soMpagu pMtalu sukaalakShaemamul shoabhilu
gaehamun aarya saaMgathyamu naishvaryamula nila nanubhaviMpave neevaa
yaaDyuni paermini ||nuthi||
2. dhurithamu lMdhe dhurgathi nunna nee kuruthara praemanu baramaarTha
meeyanu varaputhru nosAOgAOde vMdhaneeyuAOdu prabhu marimari
mrokku maa paramoapakaarini ||nuthi||
3. jeevamu jnYaanamu jeevamu nosMgedu paavanaathmanu neekai pMpina
dhaevudu kaevala dhoaSh sva bhaavamu maarchAOde saeva jaeyuma neevaa
paavanamoorthiki ||nuthi||
4. karamulu padhamul kanakaadhu lanniyu svaramunu chiththamu sThiramagu
praemayu mari needhu hrudhayamu paramaathmu saevakai paripoorNamuga
nichchi praNuthiMchu maayanan ||nuthi||