ee gudiymdhu pravaeshimpan yaeఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని
ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని బిలువగ రారండి ఆయన రానిదె
దీవెనలు ఆశీర్వాదము లరుదగును ||ఈ గుడి||
1. ఆకా శము మన దేవునికి అత్యున్నత సింహాసనము పాదములకు యీ
భూమియును పీఠముగా నొప్పును సుమ్ము ||ఈ గుడి||
2. ఆయన సన్నిధి కాంతియె యీ ఆలయమంతట నిండుకొనన్ ఆయన
యాత్మ సహాయమున ఆరాధనలను జరుపుటకై ||ఈ గుడి||
3. నిర్మలమైన సువార్తను బో ధింపగ సాయము జేయుటకు బోధకు లైన
సువార్తికుల బోధను నాటగ జేయుటకు ||ఈ గుడి||
4. ప్రార్థన విశ్వాసాయుతమౌ భక్తిని నేర్పెడి నిలయముగ భక్తులు దేవుని
సన్నిధిలో బాగుగ స్థిరపడ జేయుటకు ||ఈ గుడి||
5. ఈ పట్టణమున వెలుగుటకు ఈ ప్రజలందరి రక్షణకు ఈ గుడి యీ
సభ బలపడుచు సాగుచు వృద్ధిని జెందుటకు ||ఈ గుడి||
6. బాప్తిస్మము నిర్ధారణలు ప్రభు భోజన సంస్కారములు బాగుగ
జరుగుచుండుటకు భక్తిని పెంపొదించుటకు ||ఈ గుడి||
7. తండ్రి కుమార శుద్ధాత్మకు తావుగ నీ గుడియుండుటకు త్రేకుని దీవెన
వర్షములు దీనిపై నిరతము కురియుగాక ||ఈ గుడి||
ee gudiyMdhu pravaeshiMpan yaesuni biluvaga raarMdi aayana raanidhe
dheevenalu aasheervaadhamu larudhagunu ||ee gudi||
1. aakaa shamu mana dhaevuniki athyunnatha siMhaasanamu paadhamulaku yee
bhoomiyunu peeTamugaa noppunu summu ||ee gudi||
2. aayana sanniDhi kaaMthiye yee aalayamMthata niMdukonan aayana
yaathma sahaayamuna aaraaDhanalanu jaruputakai ||ee gudi||
3. nirmalamaina suvaarthanu boa DhiMpaga saayamu jaeyutaku boaDhaku laina
suvaarthikula boaDhanu naataga jaeyutaku ||ee gudi||
4. praarThana vishvaasaayuthamau bhakthini naerpedi nilayamuga bhakthulu dhaevuni
sanniDhiloa baaguga sThirapada jaeyutaku ||ee gudi||
5. ee pattaNamuna velugutaku ee prajalMdhari rakShNaku ee gudi yee
sabha balapaduchu saaguchu vrudhDhini jeMdhutaku ||ee gudi||
6. baapthismamu nirDhaaraNalu prabhu bhoajana sMskaaramulu baaguga
jaruguchuMdutaku bhakthini peMpodhiMchutaku ||ee gudi||
7. thMdri kumaara shudhDhaathmaku thaavuga nee gudiyuMdutaku thraekuni dheevena
varShmulu dheenipai nirathamu kuriyugaaka ||ee gudi||