aalimchu maa praarthana maa raఆలించు మా ప్రార్థన మా రక్షకా య
ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు మా ప్రార్థన నాలింతు
వని నమ్మి యాసక్తి వేఁడెదము మేలైన దీవెనలు మెండుగాఁ
గురిపించి ||యాలించు||
1. ఈ సదన మర్పింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాఖ్యను నీ
సేవకై మేము నెనరుచే నొసఁగు ని వాసము గైకొని వర కరుణచే నిప్పు
||డాలించు||
2. ఇందుఁ గూడెడు భక్తుల డెందము లనెడు మందిరంబుల నాత్మచే
పొందుగ నివసించి పూర్ణుఁడ వగు దేవ యంద మైన సుగుణ
బృందంబుతో నింపి ||యాలించు||
3. ఇచ్చట శుభవార్తను విచ్చల విడిగ వచ్చి వినెడు పాపులఁ జెచ్చెర
రక్షించి యిచ్చి శుద్ధాత్మను సచ్చరిత్రులఁ జేసి సాంద్ర మగు కరుణచే
||నాలించు||
4. నభము నేలెడి తండ్రి యిచ్చోటను శుభవార్త బోధించెడు ప్రభు
యేసు సేవకులు సభకు మాదిరు లగుచు సభ వృద్ధి నొందింప శక్తి
వారల కిచ్చి ||యాలించు||
5. చుట్టు నుండెడు నూళ్లలో శుభ వాక్యంబు దిట్టముగఁ బ్రకటింపఁ గఁ
పట్టు గల్గెడివారి బంపి యిచ్చటనుండి దట్టమగు నీ ప్రేమఁ దగినట్లు
తెలిపించి ||యాలించు||
aaliMchu maa praarThana maa rakShkaa yaaliMchu maa praarThana naaliMthu
vani nammi yaasakthi vaeAOdedhamu maelaina dheevenalu meMdugaaAO
guripiMchi ||yaaliMchu||
1. ee sadhana marpiMthumu maa priya janaka nee suthuni dhivyaakhyanu nee
saevakai maemu nenaruchae nosAOgu ni vaasamu gaikoni vara karuNachae nippu
||daaliMchu||
2. iMdhuAO goodedu bhakthula deMdhamu lanedu mMdhirMbula naathmachae
poMdhuga nivasiMchi poorNuAOda vagu dhaeva yMdha maina suguNa
bruMdhMbuthoa niMpi ||yaaliMchu||
3. ichchata shubhavaarthanu vichchala vidiga vachchi vinedu paapulAO jechchera
rakShiMchi yichchi shudhDhaathmanu sachcharithrulAO jaesi saaMdhra magu karuNachae
||naaliMchu||
4. nabhamu naeledi thMdri yichchoatanu shubhavaartha boaDhiMchedu prabhu
yaesu saevakulu sabhaku maadhiru laguchu sabha vrudhDhi noMdhiMpa shakthi
vaarala kichchi ||yaaliMchu||
5. chuttu nuMdedu nooLlaloa shubha vaakyMbu dhittamugAO brakatiMpAO gAO
pattu galgedivaari bMpi yichchatanuMdi dhattamagu nee praemAO dhaginatlu
thelipiMchi ||yaaliMchu||