• waytochurch.com logo
Song # 3094

ishraayaeleeyula dhaevumdae yeఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్త


Chords: ragam: బ్యాగు-byaagu

ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ
తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె ||నిశ్రా||

1. తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన
శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె ||నిశ్రా||


2. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన
పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె ||నిశ్రా||


3. జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి
మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ ||నిశ్రా||


4. ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన
సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె ||నిశ్రా||


5. ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని
వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద ||నిశ్రా||


6. మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన
మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి ||నిశ్రా||


7. మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో
మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె ||నిశ్రా||


8. జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును
పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్ ||నిశ్రా||

ishraayaeleeyula dhaevuMdae yeMthoa sthuthi noMdhunu gaaka yaashrithuvau
thana janulaku dharshana maathma vimoachana kaligiMche ||nishraa||

1. thana dhaasuAOdu dhaaveedhu gruhMbuna ghana rakShNa shruMgamu nichche mana
shathruvu lagu dhvaeShulanuMdiyu manalan baapi rakShNa nichche ||nishraa||


2. dheenini goorchi pravakthala noata dhaevuAOdu palikiMchenu dholli maanava mana
pitharulAO garuNiMpAOga mahiloana nibMDhanAO jaese ||nishraa||


3. janakuM dhagu nabraahaamuthoaAO jaesina yaa pramaaNamuAO dhalAOchi
manamu viroaDhulanuMdi vimoachana gani nirbhayulamai melAOga ||nishraa||


4. aayana sanniDhaanamunMdhu nathi shudhDhiga neethiga nuMdAO paayaka thana
saevanu nithyMbunu jaeyAOga nee rakShNa nichche ||nishraa||


5. Dhara noa shishuvaa dhaevuni dheergha dharshi vanedu paeroMdhedhavu paramaeshvaruni
vaathsalyathathoaAO paapavimukthiAO braja loMdha ||nishraa||


6. maanuga rakShNa jnYaana mosMgAOga maargamu sidhDhaparachutakai dheena
manassuthoaAO brabhunaku muMdhu gaa nadichedhavu bhayabhakthi ||nishraa||


7. mariyunu samaaDhaana saraNiloa mana meeAOka naduvAO jeeAOkatiloa
maraNachChaayaloa nuMdina vaariki naruNoadhaya dharshana michche ||nishraa||


8. janaka puthraathma dhaevuni kilaloa ghanatha mahima kalgunu gaaka munu
pipu deppudu thanari natlu yuga mulakunu dhanaraarunugaa kaamaen ||nishraa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com