oka saari aalochinchava ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా
పల్లవి: ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ (2X) నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో (2X) … ఒకసారి… 1. తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో (2X) నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను . . ..నీ జీవిత… 2. దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి (2X) లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా ...నీ జీవిత … 3. లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు (2X) నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా ...నీ జీవిత …