shree rakshkumdu puttaogaa naakaashశ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ
1. శ్రీ రక్షకుండు పుట్టఁగా
నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు
ఈ పాట పాడెను.
'పరంబునందు స్వామికి
మహా ప్రభావము
ఇహంబునందు శాంతిని
వ్యాపింపనీయుఁడు'.
2. ఆ రమ్యమైన గానము
ఈ వేళ మ్రోగును
సంతుష్టులైన భక్తులు
ఆ ధ్వని విందురు
ప్రయాసపడు ప్రజల
దుఃఖంబు తీరఁగా
ఆ శ్రావ్యమైన గానము
ఈ వేళ విందురు.
3. పూర్వంబు దూతగానము
భువిన్ వినంబడి
రెండువేల వర్షములు
గతించిపోయెను
భూప్రజలు విరోధులై
యుద్ధంబు లాడి యా
మనోజ్ఞమైన గానము
నలక్ష్యపెట్టిరి.
4. పాపాత్ములారా, వినుఁడి
శ్రీ యేసు ప్రభువు
మీ పాపభార మంతయు
వహింప వచ్చెను
తాపత్రయంబు నంతయుఁ
దానే వహించును
సంపూర్ణ శాంతి సంపద
లను గ్రహించును.
5. సద్భక్తులు స్తుతించిన
ఈ సత్యయుగము
ఈ వేళ నే నిజంబుగా
సమీప మాయెను
ఆ కాలమందు క్షేమము
వ్యాపించుచుండెను
ఆ దివ్య గాన మందఱు
పాడుచు నెప్పుడు.
1. shree rakShkuMdu puttAOgaa
naakaasha sainyamu
ihMbuna kaetheMchuchu
ee paata paadenu.
'parMbunMdhu svaamiki
mahaa prabhaavamu
ihMbunMdhu shaaMthini
vyaapiMpaneeyuAOdu'.
2. aa ramyamaina gaanamu
ee vaeLa mroagunu
sMthuShtulaina bhakthulu
aa Dhvani viMdhuru
prayaasapadu prajala
dhuHkhMbu theerAOgaa
aa shraavyamaina gaanamu
ee vaeLa viMdhuru.
3. poorvMbu dhoothagaanamu
bhuvin vinMbadi
reMduvaela varShmulu
gathiMchipoayenu
bhooprajalu viroaDhulai
yudhDhMbu laadi yaa
manoajnYmaina gaanamu
nalakShyapettiri.
4. paapaathmulaaraa, vinuAOdi
shree yaesu prabhuvu
mee paapabhaara mMthayu
vahiMpa vachchenu
thaapathrayMbu nMthayuAO
dhaanae vahiMchunu
sMpoorNa shaaMthi sMpadha
lanu grahiMchunu.
5. sadhbhakthulu sthuthiMchina
ee sathyayugamu
ee vaeLa nae nijMbugaa
sameepa maayenu
aa kaalamMdhu kShaemamu
vyaapiMchuchuMdenu
aa dhivya gaana mMdhaRu
paaduchu neppudu.