rmdi paada dhoothalaaraa nimdu smthoashmరండి పాడ దూతలారా నిండు సంతోషం
1. రండి పాడ దూతలారా
నిండు సంతోషంబుతో
యేసుని జన్మంబు గూర్చి
ఈ భూలోకమంతట
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.
2. మందగాయు గొల్లలార!
మనుష్యులతో నేడు
వాసంబు జేయుచున్నాఁడు
వాసిగాను దేవుండు
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.
3. జ్ఞానులారా! మానుడింక
యోచనలం జేయుట
మానుగాను వెదకుడేసున్
చూచుచు నక్షత్రమున్
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.
4. పరిశుద్ధులారా! మీరు
నిరీక్షించుచుండిన
యేసు ప్రభువాలయంబు
యేతెంచెను చూడుడి
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.
5. పశ్చాత్తాప మొందియున్న
పాపులార! మీకు వి
ముక్తి గల్గె; శక్తి నొంది
రక్తి నేసుంజేరుడి
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.
1. rMdi paada dhoothalaaraa
niMdu sMthoaShMbuthoa
yaesuni janmMbu goorchi
ee bhooloakamMthata
rMdi naedu puttinatti
raaju naaraaDhiMchudi.
2. mMdhagaayu gollalaara!
manuShyulathoa naedu
vaasMbu jaeyuchunnaaAOdu
vaasigaanu dhaevuMdu
rMdi naedu puttinatti
raaju naaraaDhiMchudi.
3. jnYaanulaaraa! maanudiMka
yoachanalM jaeyuta
maanugaanu vedhakudaesun
choochuchu nakShthramun
rMdi naedu puttinatti
raaju naaraaDhiMchudi.
4. parishudhDhulaaraa! meeru
nireekShiMchuchuMdina
yaesu prabhuvaalayMbu
yaetheMchenu choodudi
rMdi naedu puttinatti
raaju naaraaDhiMchudi.
5. pashchaaththaapa moMdhiyunna
paapulaara! meeku vi
mukthi galge; shakthi noMdhi
rakthi naesuMjaerudi
rMdi naedu puttinatti
raaju naaraaDhiMchudi.