udhayimchinaaaodu kreesthuaoduఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు
Chords: ragam: సురటి-surati
ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయౌ
మరియ నందనుఁడై యిమ్మానుయేల్ సదయుఁడై చెడియున్న పృథివికి
నొదవ సమ్మద మల పిశాచికి మద మణంగను సాధు జనముల
హృదయముల ముద మెదుగునట్లుగ ||నుదయించి||
1. ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు
మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనముపై తగ దేవుఁడును దా
నొక్కఁడు చిర జీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు
నొడఁబడి ||యుదయించి||
2. యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి
ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మీదుఁ జూడని వారి కారుండ
వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ డౌ దయాళుఁడు
ప్రాణ మీడుటకు ||నుదయించి||