putte yaesuaodu naeaodu manakuపుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్
పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము జూపను పట్టి యయ్యెఁ
బరమ గురుఁడు ప్రాయశ్చిత్తుఁడు యేసుడు ||పుట్టె||
1. ధరఁ బిశాచిని వేఁడిన దు ర్నరులఁ బ్రొచుటకై యా పరమవాసి
పాపహరుఁడు వరభక్త జన పోషుఁడు ||పుట్టె||
2. యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె
నధములమైన మనలఁ ||బుట్టె||
3. తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని
మరియు కొమరుని కర్పణము లిచ్చిరి ||పుట్టె||
putte yaesuAOdu naeAOdu manaku puNyamaargamu joopanu patti yayyeAO
barama guruAOdu praayashchiththuAOdu yaesudu ||putte||
1. DharAO bishaachini vaeAOdina dhu rnarulAO brochutakai yaa paramavaasi
paapaharuAOdu varabhaktha jana poaShuAOdu ||putte||
2. yoodha dhaeshamuloanu baethle haemanu graamamuna naadhariMpa nudhbhaviMche
naDhamulamaina manalAO ||butte||
3. thoorpu jnYaanulu koMdhaRu poorva dhikku chukkanu gaaMchi sarvoannathuni
mariyu komaruni karpaNamu lichchiri ||putte||