emthoa ghanamaguvaaralu parishఎంతో ఘనమగువారలు పరిశుద్ధులు ఎం
ఎంతో ఘనమగువారలు పరిశుద్ధులు ఎంతో వినదగువారలు
సంతసంబుగ వార త్యంత ప్రేరణతోడ సొంతవారిని సహా సొంతంబుగ
విడచి చెంతజేరిరి యేసు ప్రభుని చింతలేకను వెంబడించి వింత
పనులను జేసి బ్రతికిరి అంతమువరకును నడచిరి ||ఎంతో||
1. పేతు రపోస్తలుండు అతని సోదరు డతి ప్రియు డంద్రెయయు నీతి
నియమములందు ప్రీతితో బ్రదుకుచు చేతి పనులయందు శ్రద్ధతో
నుండుచు ఖ్యాతి నొందిన యోహాను అతని యన్న యాకోబుతోను ప్రతి
దినంబును కలిసి యుండుచు భక్తి ప్రభువును వెంబడించిరి ||ఎంతో||
2. ఆస్తి నిచ్చిన బర్నబా ఆస్తిపరుడ పోసలులతో జేరెన్ స్వస్థబుద్ధి తోడ
ఆస్తివాడుట యెట్లో క్రీస్తు సేవకొరకు ఖర్చుపెట్టుట యెట్లో వాస్తవముగ
నేర్పినాడు ఆస్తిగలవారలకు నెల్ల ప్రస్తుతంపు ఆస్తిపాస్తులు ప్రభువు
పనికియ్యవలెనని ||ఎంతో||
3. సంఘమును హింసించిన సంఘాభిమాని సంఘ నాయకుడు పౌలు
సంఘముల నెన్నటినో చక్కగను స్థాపించి సంఘముల కుత్తరముల్
సమయానుకులముగ సంఘ కాపరులకును సహా సరియగు సలహాల
నిచ్చి సంఘములను ప్రభువు కొరకై స్థాపించి నిలుపలేదా ||ఎంతో||
4. కన్యయైన మరియమ్మ ధన్యురాలు కన్యలకు తల్లులకున్ను అన్యులకు
అందరికి ఆదర్శముగ నుండ సన్యాసిను లెందరో స్వామిని సేవించ
కన్యకలుగ నిలుచువారలు కఠినవ్రతములతోడ నుండి ధన్యులగు
పరిశుద్ధులతో దైవసన్నిధి నుండ జూపెను ||ఎంతో||
5. మగదాలయూరి మరియ మహినినున్న మగువలలో కెల్లను భగవంతుడై
నట్టి ప్రభువు యేసునుజేరి నగము నెక్కెను తన సొగసైన మార్పుచే
సాగి మొదట సమాధికడకు స్వామిదర్శనమొంది మొదట వేగవెళ్లి శిష్యులకును
వెదకి సాక్ష్యమియ్యలేదా ||ఎంతో||
6. మత్తయి మార్కులను వారు మతమునందు అతినిష్టగలవారలు మత్తయి
యూదులకై తన పుస్తకమును వ్రాసె మార్కు గూడను తన సు వార్తనందరి
కిచ్చె వాస్తవంపు జీవితమును వరుసగాను గలిగియుండ క్రీస్తు ప్రభువును
వెంబడించగ క్రొత్తలోకము జూపగలిగిరి ||ఎంతో||
7. చూచననేగాని నమ్మనని పేచిపెట్టి నతోమయు చాచి చేయి చూచి
చక్కగ నమ్మెను చూడకుండనె లూక వైద్యుండు నమ్మెను యీ చొప్పున
వీరలిద్దరు నీచజనులకెల్లరకు తము బ్రోచు ప్రభువును జూపుచుందురు
బ్రోదిగా ప్రతిదినమునందును ||ఎంతో||
8. ప్రభువా నీ పరిశుద్ధుల బ్రతుకునందు మా భాగ్యమునున్నదిహా
ప్రభువా వారి బ్రదుకు ప్రబలమైన సేవ విభవంగాగని విజయంబు
గాంచుచు వారితో నేలునట్లు యభయమియ్యు మాకు దేవా ||ఎంతో||
eMthoa ghanamaguvaaralu parishudhDhulu eMthoa vinadhaguvaaralu
sMthasMbuga vaara thyMtha praeraNathoada soMthavaarini sahaa soMthMbuga
vidachi cheMthajaeriri yaesu prabhuni chiMthalaekanu veMbadiMchi viMtha
panulanu jaesi brathikiri aMthamuvarakunu nadachiri ||eMthoa||
1. paethu rapoasthaluMdu athani soadharu dathi priyu dMdhreyayu neethi
niyamamulMdhu preethithoa bradhukuchu chaethi panulayMdhu shradhDhathoa
nuMduchu khyaathi noMdhina yoahaanu athani yanna yaakoabuthoanu prathi
dhinMbunu kalisi yuMduchu bhakthi prabhuvunu veMbadiMchiri ||eMthoa||
2. aasthi nichchina barnabaa aasthiparuda poasalulathoa jaeren svasThabudhDhi thoada
aasthivaaduta yetloa kreesthu saevakoraku kharchupettuta yetloa vaasthavamuga
naerpinaadu aasthigalavaaralaku nella prasthuthMpu aasthipaasthulu prabhuvu
panikiyyavalenani ||eMthoa||
3. sMghamunu hiMsiMchina sMghaabhimaani sMgha naayakudu paulu
sMghamula nennatinoa chakkaganu sThaapiMchi sMghamula kuththaramul
samayaanukulamuga sMgha kaaparulakunu sahaa sariyagu salahaala
nichchi sMghamulanu prabhuvu korakai sThaapiMchi nilupalaedhaa ||eMthoa||
4. kanyayaina mariyamma Dhanyuraalu kanyalaku thallulakunnu anyulaku
aMdhariki aadharshamuga nuMda sanyaasinu leMdharoa svaamini saeviMcha
kanyakaluga niluchuvaaralu kaTinavrathamulathoada nuMdi Dhanyulagu
parishudhDhulathoa dhaivasanniDhi nuMda joopenu ||eMthoa||
5. magadhaalayoori mariya mahininunna maguvalaloa kellanu bhagavMthudai
natti prabhuvu yaesunujaeri nagamu nekkenu thana sogasaina maarpuchae
saagi modhata samaaDhikadaku svaamidharshanamoMdhi modhata vaegaveLli shiShyulakunu
vedhaki saakShyamiyyalaedhaa ||eMthoa||
6. maththayi maarkulanu vaaru mathamunMdhu athiniShtagalavaaralu maththayi
yoodhulakai thana pusthakamunu vraase maarku goodanu thana su vaarthanMdhari
kichche vaasthavMpu jeevithamunu varusagaanu galigiyuMda kreesthu prabhuvunu
veMbadiMchaga kroththaloakamu joopagaligiri ||eMthoa||
7. choochananaegaani nammanani paechipetti nathoamayu chaachi chaeyi choochi
chakkaga nammenu choodakuMdane looka vaidhyuMdu nammenu yee choppuna
veeralidhdharu neechajanulakellaraku thamu broachu prabhuvunu joopuchuMdhuru
broadhigaa prathidhinamunMdhunu ||eMthoa||
8. prabhuvaa nee parishudhDhula brathukunMdhu maa bhaagyamununnadhihaa
prabhuvaa vaari bradhuku prabalamaina saeva vibhavMgaagani vijayMbu
gaaMchuchu vaarithoa naelunatlu yabhayamiyyu maaku dhaevaa ||eMthoa||