vmdhanm bonarthumoa prabhoa prవందనం బొనర్తుమో ప్రభో ప్రభో వం
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముఁడా వదనంబు లందు కో ప్రభో
||వందనం||
1. ఇన్ని నాళ్లు ధరను మమ్ముఁ బ్రోచియుఁ గన్న తండ్రి మించి యెపుడు
గాచియు ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రము
లివిగో ||వందనం||
2. ప్రాత వత్సరంపుఁ బాప మంతయుఁ బ్రీతిని మన్నించి మమ్ముఁ గావుము
నూత నాబ్దమనను నీదు నీతి నొసఁగు మా దాత క్రీస్తు నాధ రక్షకా
||వందనం||
3. దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాళి తనువు దినము లన్నియు నీ
వొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం||
4. కోఁతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతిఁ బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుఁడా
||వందనం||
5. మా సభలకు పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నంధకార మంతఁ ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము
||వందనం||
vMdhanM bonarthumoa prabhoa prabhoa vMdhanM bonarthumoa prabhoa prabhoa
vMdhanMbu thMdri, thanaya, shudhDhaathmuAOdaa vadhanMbu lMdhu koa prabhoa
||vMdhanM||
1. inni naaLlu Dharanu mammuAO broachiyuAO ganna thMdri miMchi yepudu
gaachiyu ennilaeni dheevena lidu nanna yaesuvaa yanni retlu sthoathramu
livigoa ||vMdhanM||
2. praatha vathsarMpuAO baapa mMthayuAO breethini manniMchi mammuAO gaavumu
nootha naabdhamananu needhu neethi nosAOgu maa dhaatha kreesthu naaDha rakShkaa
||vMdhanM||
3. dhaeva maadhu kaalusaethu lellanu saevakaaLi thanuvu dhinamu lanniyu nee
vosMgu veMdi, pasidi jnYaana mMtha nee saevakai yMgeekariMchumaa ||vMdhanM||
4. koaAOthakoraku dhaasajanamu nMpumu ee thari maa loatupaatlu dheerchumu
paathakMbu lella maapi bheethiAO baapumu khyaathi noMdhu neethi sooryuAOdaa
||vMdhanM||
5. maa sabhalaku pedhdhajaesi peMchumu nee suvaartha jeppa shakthi neeyumu
moasapuchchu nMDhakaara mMthAO dhroayumu yaesu krupan gummariMchumu
||vMdhanM||