dhaivapraema manalanepudu bmdhదైవప్రేమ మనలనెపుడు బంధించుగా ద
Chords: ragam: తిల్కా మోద్-thilkaa moadh
దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని భువిని దీన జనులను
దిరముగా కాపాడుగా||
1. పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్ మరిజేతుము పలు విధముల
మార్గములలో ప్రభువే తోడైయుండుగా ||దైవ||
2. నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము నిలిచియుందుము
క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా ||దైవ||
3. మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్గును వేదన మనసు హృదయము
కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో ||దైవ||
4. జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు ఆదినుండి
యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా ||దైవ||