emdhukoa nannimthagaa neevu prఎందుకో నన్నింతగా నీవు ప్రేమించ
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
1. నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ||హల్లె||
2. నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుచున్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో ||హల్లె||
3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నాము
నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు ||హల్లె||
4. నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీసంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే ||హల్లె||
5. నా మనువులు ముందే నీ మనస్సులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంధంబులో నుండె
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ ||హల్లె||
eMdhukoa nanniMthagaa neevu praemiMchithivoa dhaevaa
aMdhukoa naa dheena sthuthipaathra hallelooya yaesayyaa
1. naa paapamu baapa nararoopivainaavu
naa shaapamu maapa naligi vraelaadithivi
naaku chaalina dhaevudavu neevae naa sThaanamuloa neevae ||halle||
2. nee roopamu naaloa nirmiMchiyunnaavu
nee poalikaloanae nivasiMchuchunnaavu
neevu nannu ennukoMtivi nee korakai nee krupaloa ||halle||
3. naa shramalu sahiMchi naa aashrayamainaavu
naa vyaDhalu bhariMchi nannaadhukonnaamu
nannu neeloa choochukunnaavu nanu dhaachiyunnaavu ||halle||
4. nee sanniDhi naaloa naa sarvamu neeloa
neesMpadha naaloa naa sarvasvamu neeloa
neevu naenu aekamaguvaraku nannu viduvanMtivae ||halle||
5. naa manuvulu muMdhae nee manassuloa neravaerae
naa manugada muMdhae nee grMDhMbuloa nuMde
aemi adhbhutha praema sMkalpM naenaemi chelliMthun ||halle||