• waytochurch.com logo
Song # 3150

katina hrudhayamaa karugava dhకఠిన హృదయమా కరుగవ దేవుని గడువు


కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు
గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా

1. ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను
కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా ||కఠిన||


2. సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా
సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా ||కఠిన||


3. నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు
జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!


4. దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన
గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు ||కఠిన||


5. మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను
వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు ||కఠిన||


6. ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ
రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే ||కఠిన||


7. నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను
ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన ||కఠిన||


8. పాపప్రతాపము నెరుగుదువ దాని శాపము తాపము నెరుగు
దువా పాపము నొకపరి బట్టితివా అది పట్టుబడి కఠినపరచు ||కఠిన||


9. లోలోపలన న్యాయమబద్దములోపము కలిగిన మోసములో
కాలయాపనచేయ నుపాయములేల? వేషధారణయేల ||కఠిన||

kaTina hrudhayamaa karugava dhaevuni gaduvulu
gani vinavaa dhebbalu galigina loabadavaa

1. ennoa gaduvulu ennoamaarulu ennoa gaduvulu dhorikinanu
kannumoosikoni kadhaluchunuMdhuvu kanikara karamunugani maanavaa ||kaTina||


2. sruShtikarthaku mrokkedhavaa! thana sruShtini goni poojiMchedhavaa
sruShtikartha viroaDhi dhayyamula chaeShtalella mMdhriMchedhavaa ||kaTina||


3. neeramu rakthamugaa maarinanu bhaaramugaa ka ppalu paelu
joareegalu goppa thegulu vachchina guNapadenaa phroaraaju!


4. dhadhdhurulai bobbalu pokkinanu hadhdhulaeka pidugulu padina
grudhdhinatlu vadagMdlu kurisinanu guNapadenaa phroaraaju ||kaTina||


5. miduthala dhMdulu chelaraegi yaamigilina vaatini mriMginanu
vadivadithadabadu nMDhakaaramae vachchina guNapade naa raaju ||kaTina||


6. ghoaShpetti dhaeshamellanaedvaga guMpulugaa jyaeShtulu chaava
roaShmuthoa veMtabadi nashiMchi dhoaShmukai dhuHkhamupadirae ||kaTina||


7. naShtamu kaShtamu kaliginanu mari narulunu dhaevude cheppinanu
iShtapadavu rakShiMpabadutakai irukupadina nirukuna jedina ||kaTina||


8. paapaprathaapamu nerugudhuva dhaani shaapamu thaapamu nerugu
dhuvaa paapamu nokapari battithivaa adhi pattubadi kaTinaparachu ||kaTina||


9. loaloapalana nyaayamabadhdhamuloapamu kaligina moasamuloa
kaalayaapanachaeya nupaayamulaela? vaeShDhaaraNayaela ||kaTina||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com