kraisthavumdaa kadhiliraavayyaక్రైస్తవుండా కదిలిరావయ్యా కలుష
క్రైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు యీ
సిలువశక్తి జాటవేమయ్యా యెండవానలనియు జడిసి
ఎంతకాలము మూలనుందువు కండలను ప్రేమింతువేమన్నా
ఈ మంటికండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||క్రైస్తవ||
1. వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు వివక్షుద్భాధకొని
వాంఛించుచుండగను మిషనులెల్లను మిషలచేత
మిట్టిపడుచు వాదములతో యేసు బోధను విడచినారన్నా
నీవెంతకాలము వారిచెంత నుందువోరన్న ||క్రైస్తవ||
2. సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు దొరల
బత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల
బోధలు చేసి బ్రజలను మోసగించు సూత్రధారుల
జేర రాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యము
చాట రావయ్యా ||క్రైస్తవ||
3. శక్తిహీనుడనందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని
పొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట
మనస్సు బయలుపరచు శక్తికలుగు సువార్త చాటుదువు
సువార్త చేయ జయమొంది ఆత్మలను రక్షించెదవు ||క్రైస్తవ||
4. నీతికై భక్తాదిపరులెల్ల నిజవిశ్వాసము నిలుపుకొన
పోరాడిరే చాలకత్తిపోటులు రాళ్ళదెబ్బలు కరకు గల
రంపములు కోతలు బెత్తములు కొరడాల దెబ్బలు పైబడి
చీలి దేహము వాలలాడెను రక్తము భువిపై ||క్రైస్తవ||
5. ఆది సంఘము నార్పుటకు నెంచి ఆ దుష్ట నీరో అధిపతి
చెలరేగి గర్వించి ఆదిక్రైస్తవ భక్తుల స్థంభముల గట్టి
తారుపూసి అగ్నిని ముట్టించి కాల్వంగ ఆ సంఘ మెచ్చె
అధిపతి అప్పుడె నశియించె ||క్రైస్తవ||
6. దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సఖుండా ఖ్యాతిగా
నీ కిచ్చె గ్రంథంబు భీతియేల తినుము గ్రంథము తేనెవలె
మధురముగ నుండున జ్ఞానము నీకబ్బునో హితుడ
జ్ఞానంబునొంది స్వామిని సేవించుమో సఖుండా ||క్రైస్తవా||
kraisthavuMdaa kadhiliraavayyaa kaluShaathmulaku yee
siluvashakthi jaatavaemayyaa yeMdavaanalaniyu jadisi
eMthakaalamu moolanuMdhuvu kMdalanu praemiMthuvaemannaa
ee mMtikMdalu eMtha beMchina mMtikaenannaa ||kraisthava||
1. vasuDhaloa prajalellaru yaesu vaakyMbu vivakShudhbhaaDhakoni
vaaMChiMchuchuMdaganu miShnulellanu miShlachaetha
mittipaduchu vaadhamulathoa yaesu boaDhanu vidachinaarannaa
neeveMthakaalamu vaaricheMtha nuMdhuvoaranna ||kraisthava||
2. sathyavaakyamu sMthaloadhulipi boaDhakulu dhorala
bathyamulapai bhraaMthulu nilipi chithramagu anukoola
boaDhalu chaesi brajalanu moasagiMchu soothraDhaarula
jaera raadhayyaa sukhabhoagamidichi sathyavaakyamu
chaata raavayyaa ||kraisthava||
3. shakthiheenudanMdhu vaemayyaa saujanyamagu shudhDhaathmashakthini
poMdhukonumayyaa bhakthiheenatha paaradhroalu bhraShta
manassu bayaluparachu shakthikalugu suvaartha chaatudhuvu
suvaartha chaeya jayamoMdhi aathmalanu rakShiMchedhavu ||kraisthava||
4. neethikai bhakthaadhiparulella nijavishvaasamu nilupukona
poaraadirae chaalakaththipoatulu raaLLadhebbalu karaku gala
rMpamulu koathalu beththamulu koradaala dhebbalu paibadi
cheeli dhaehamu vaalalaadenu rakthamu bhuvipai ||kraisthava||
5. aadhi sMghamu naarputaku neMchi aa dhuShta neeroa aDhipathi
chelaraegi garviMchi aadhikraisthava bhakthula sThMbhamula gatti
thaarupoosi agnini muttiMchi kaalvMga aa sMgha mechche
aDhipathi appude nashiyiMche ||kraisthava||
6. dhoothalaku laenatti paricharya oa priya sakhuMdaa khyaathigaa
nee kichche grMThMbu bheethiyaela thinumu grMThamu thaenevale
maDhuramuga nuMduna jnYaanamu neekabbunoa hithuda
jnYaanMbunoMdhi svaamini saeviMchumoa sakhuMdaa ||kraisthavaa||