anyajanulaela laechi gallaththu chaeyuchunnaaruఅన్యజనులేల లేచి గల్లత్తు చేయుచున్నారు
Reference: నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కీర్తన Psalm 2:1-10
పల్లవి: అన్యజనులేల లేచి - గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల
అను పల్లవి: జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి
1. భూలోక రాజులు లేచి - వారేకముగా ఆలోచించి
వారి పాశములను తెంపి - పారవేయుద మనుచున్నారు
2. ఆకాశ వాసుండు - వారిని - అపహసించుచున్నాడు - నవ్వి
వారలతో పల్కి కోపముతో - వారిని తల్లడిల్ల చేయును
3. పరిశుద్ధమైన - నాదు - పర్వతమగు సీయోను మీద
నారాజునాసీనునిగా జేసి - యున్నానని సెలవిచ్చెను
4. కట్టడ వివరింతు - నాకు - యిట్లు చెప్పెను యెహోవాయందు
నీవు నా కుమారుండవు - నిన్ను నేను కనియున్నాను
5. నన్ను అడుగుము - నీకు - జనముల భూమిని స్వాస్థ్యముగా
దిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు
6. ఇనుప దండముతో - నీవు - వారిని నలుగగొట్టెదవు
కుండను పగులగొట్టునట్లు - వారిని పగులగొట్టెదవు
7. ఓ రాజులారా - మీరు - జ్ఞానవంతులై యుండుడి
ఓ భూపతులారా - మీరు - నాభోద నొందుడి నేడే
Reference: naenu naa parishudhDha parvathamaina seeyoanu meedha naa raajunu aaseenunigaa chaesiyunnaanu. keerthana Psalm 2:1-10
Chorus: anyajanulaela laechi - gallaththu chaeyuchunnaaru anyajanulaela
Chorus-2: janamulaela vyarThamaina dhaani thalMchuchunnavi
1. bhooloaka raajulu laechi - vaaraekamugaa aaloachiMchi
vaari paashamulanu theMpi - paaravaeyudha manuchunnaaru
2. aakaasha vaasuMdu - vaarini - apahasiMchuchunnaadu - navvi
vaaralathoa palki koapamuthoa - vaarini thalladilla chaeyunu
3. parishudhDhamaina - naadhu - parvathamagu seeyoanu meedh
naaraajunaaseenunigaa jaesi - yunnaanani selavichchenu
4. kattada vivariMthu - naaku - yitlu cheppenu yehoavaayMdhu
neevu naa kumaaruMdavu - ninnu naenu kaniyunnaanu
5. nannu adugumu - neeku - janamula bhoomini svaasThyamugaa
dhigMthamula varaku svaasThyamugaa nosMgedhanu neeku
6. inupa dhMdamuthoa - neevu - vaarini nalugagottedhavu
kuMdanu pagulagottunatlu - vaarini pagulagottedhavu
7. oa raajulaaraa - meeru - jnYaanavMthulai yuMdudi
oa bhoopathulaaraa - meeru - naabhoadha noMdhudi naedae