• waytochurch.com logo
Song # 3172

udhaya saaymthramula nellavaelala prabhuvaaఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా



Reference: యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? కీర్తన Psalm 27

పల్లవి: ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా
నే ధ్యానించి పాడెదన్
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు
పాడుట వినబడుచుండున్

1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు
నేనెవరికి వెరతును?
యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె
శత్రువులు తొట్రిల్లిరి

2. యుద్ధము చేయుటకు దండు దిగినను
నా హృదయము భయపడదు
యుద్ధము రేగినను దీనియందు నే
ధైర్యము విడువకుందున్

3. యెహోవా యొద్ద వర మొక్కటడిగితిని
దానిని వెదకు చున్నాను
యెహోవా ప్రసన్నత జూచి ఆలయమున
ధ్యానించుటయే నా ఆశ

4. తన పర్ణశాలలో నను జేర్చి కాచును
నా ఆపత్కాలమునందు
తన గుడారములోన నను దాచియుంచును
దుర్గముపై నెక్కించున్

5. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని
నీవు పల్కితివి గాన
నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదను
నీ సముఖమును దాచకు

6. నా తల్లిదండ్రులు నన్ను విడచినను
యెహోవాయే చేరదీయున్
నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెద
నీ కొరకు కనిపెట్టెదన్

7. యెహోవా నాకై యుద్దేశించినది
ఆయనయే నెరవేర్చును
మహోన్నతుని మాటకు భయపడెడి పరిశుద్ధుల
కోరికలు నెరవేర్చును



Reference: yehoavaa naaku velugunu rakShNayunai yunnaadu, naenu evariki bhayapadudhunu? yehoavaa naa praaNadhurgamu, evariki verathunu? keerthana Psalm 27

Chorus: udhaya saayMthramula nellavaeLala prabhuvaa
nae DhyaaniMchi paadedhan
parishudhDhudu parishudhDhudu parishudhDhuMdani dhoothalu
paaduta vinabaduchuMdun

1. yehoavaayae naaku velugu rakShNayu
naenevariki verathunu?
yehoavaayae naa praaNa dhurgMbaaye
shathruvulu thotrilliri

2. yudhDhamu chaeyutaku dhMdu dhiginanu
naa hrudhayamu bhayapadadhu
yudhDhamu raeginanu dheeniyMdhu nae
Dhairyamu viduvakuMdhun

3. yehoavaa yodhdha vara mokkatadigithini
dhaanini vedhaku chunnaanu
yehoavaa prasannatha joochi aalayamun
DhyaaniMchutayae naa aash

4. thana parNashaalaloa nanu jaerchi kaachunu
naa aapathkaalamunMdhu
thana gudaaramuloana nanu dhaachiyuMchunu
dhurgamupai nekkiMchun

5. naa sanniDhi vedhaki naa svaramu vinumani
neevu palkithivi gaan
nee sanniDhini vedhaki nee svaramae vinedhanu
nee samukhamunu dhaachaku

6. naa thallidhMdrulu nannu vidachinanu
yehoavaayae chaeradheeyun
nae Dhairyamu kaligi nibbaramuga nuMdedh
nee koraku kanipettedhan

7. yehoavaa naakai yudhdhaeshiMchinadhi
aayanayae neravaerchunu
mahoannathuni maataku bhayapadedi parishudhDhul
koarikalu neravaerchunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com