• waytochurch.com logo
Song # 3174

evvani athikramamulu mannimpabadenoaఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో



Reference: తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తన Psalm 32

పల్లవి: ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో
పాప పరిహార మెవడోందెనో వాడే ధన్యుడు

1. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు
ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు

2. మౌనినై యుండిన దినమెల్ల నే జేసినట్టి
ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను

3. దివారాత్రుల్ నీ చేయి నా పై బరువై యుండ
నా సారము వేసవిలో ఎండినట్లాయె

4. నేను నా దోషమును కప్పుకొనక
నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని

5. నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా
నీవు నా దోషమును మన్నించితివిగా

6. కావున నీ దర్శన కాలమందు
భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు

7. విస్తార జలప్రవాహములు పొర్లినను
నిశ్చయముగా నవి వారి మీదికి రావు

8. నాకు దాగుచోటు నీవే శ్రమలో నుండి
నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా

9. విమోచన గానములతో నీవు నన్ను
ఆవరించి నాకుపదేశము చేసెదవు



Reference: thana athikramamulaku parihaaramunoMdhinavaadu thana paapamunaku praayashchiththamu noMdhinavaadu Dhanyudu. keerthana Psalm 32

Chorus: evvani athikramamulu manniMpabadenoa
paapa parihaara mevadoaMdhenoa vaadae Dhanyudu

1. yehoavaachae nirdhoaShigaa theerchabadiyu
aathmaloa kapatamu laenivaadae Dhanyudu

2. mauninai yuMdina dhinamella nae jaesinatti
aarthaDhvanichae naa yemukalu kSheeNiMchenu

3. dhivaaraathrul nee chaeyi naa pai baruvai yuMd
naa saaramu vaesaviloa eMdinatlaaye

4. naenu naa dhoaShmunu kappukonak
nee yedhuta naa paapamunu oppukoMtini

5. nee sanniDhi naa paapamula noppukonagaa
neevu naa dhoaShmunu manniMchithivigaa

6. kaavuna nee dharshana kaalamMdhu
bhakthigalavaaru ninnu praarThiMchedharu

7. visthaara jalapravaahamulu porlinanu
nishchayamugaa navi vaari meedhiki raavu

8. naaku dhaaguchoatu neevae shramaloa nuMdi
neevu nannu rakShiMchedhavu naadhu dhurgamaa

9. vimoachana gaanamulathoa neevu nannu
aavariMchi naakupadhaeshamu chaesedhavu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com