• waytochurch.com logo
Song # 3180

neeti vaagula koraku dhuppi aashapadunatluనీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు



Reference: దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? కీర్తన Psalm 42:1-5

పల్లవి: నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు
దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది

1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది
దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను

2. నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా
రాత్రింబగల్లు కన్నీరే నా అన్న పానములాయె

3. ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు
దేవుని మందిరమునకు నడిపించితిని

4. ఇది తలంచగా నా ప్రాణము కరుగుచున్నది
నాదు ప్రాణమా యేల కృంగి తొందర పడుచున్నావు?

5. రక్షకుడగు దేవునిపైన నిరీక్షణ యుంచుము
ఆయన రక్షకుడని నేనింక స్తుతించెదను



Reference: dhuppi neetivaagulakoraku aashapadunatlu dhaevaa, nee koraku naa praaNamu aashapaduchunnadhi. naa praaNamu dhaevunikoraku thruShNagonuchunnadhi. jeevamu gala dhaevuni koraku thruShNagonuchunnadhi. dhaevuni sanniDhiki naenaeppudu vachchedhanu? aayana sanniDhini naeneppudu kanabadedhanu? keerthana Psalm 42:1-5

Chorus: neeti vaagula koraku dhuppi aashapadunatlu
dhaevaa nee koraku naa praaNamu aashapadu chunnadhi

1. jeevamugala dhaevuni koraku thruShNagonuchunnadhi
dhaevuni sanniDhiki nae neppudu vachchedhanu

2. nee dhaivamaemaayenani nithyamu naathoa nanagaa
raathriMbagallu kanneerae naa anna paanamulaaye

3. uthsaaha sthuthulathoa samaajamunu pMdugaku
dhaevuni mMdhiramunaku nadipiMchithini

4. idhi thalMchagaa naa praaNamu karuguchunnadhi
naadhu praaNamaa yaela kruMgi thoMdhara paduchunnaavu?

5. rakShkudagu dhaevunipaina nireekShNa yuMchumu
aayana rakShkudani naeniMka sthuthiMchedhanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com