• waytochurch.com logo
Song # 319

yesuni roopamloniki maaripovaali యేసుని రూపం లోనికి మారాలి


యేసుని రూపం లోనికి మారాలి
యేసుని మాదిరి మనకు రావాలి
ఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపు
ఇదే ప్రభుని నీతి ఇదే ప్రభువుకు మహిమ

నీ రూపులో మము చేసి
నీదు జీవం మాకొసగి
నీ ఆజ్ఞను పాటింప నీ మహిమలో నిలిపితివే
నిన్నే మేము స్తుతియింపన్ ఎల్ల వేళలా కీర్తిoపన్
నీదు సాక్షిగా నిలిపితివే ఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపు
ఇదే ప్రభుని నీతి ఇదే ప్రభువుకు మహిమ

నీ ప్రేమను మరచితిమే నీ ఆజ్ఞను మీరితిమే
నీ సన్నిధిని విడచితిమే ద్రోహులమై నిలచితిమే
ప్రభువా మమ్ము కరుణించు మరల మమ్మును దర్శించు
క్రీస్తు రుధిరమును ప్రోక్షించు
ఇదే పాప క్షమాపణ ఆ దేవదేవుని కరుణ
ఇదే కలువరి ప్రేమ ఆ నిత్య జీవముకు మూలం


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com