• waytochurch.com logo
Song # 3193

yoodhaaloa dhaevudu prasidhdhudu ishraayaeluloa thana naamamu goppadhiయూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది



Reference: యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది. సీయోనులో ఆయన ఆలయమున్నది. కీర్తన Psalm 76

పల్లవి: యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
ఇశ్రాయేలులో తన నామము గొప్పది

అను పల్లవి: షాలేములో తన గుడారమున్నది
సీయోనులో తన ఆలయమున్నది

1. అక్కడ వింటి అగ్ని బాణములను
తాను అక్కడి కేడెముల కత్తులను
అక్కడ యుద్ధ ఆయుధములను
తాను అక్కడి వాటిని విరుగగొట్టెను
దుష్ట మృగములను పర్వతముల యందము
కన్నను నీవెంతో తేజోమయుడవు

2. కఠినహృదయులు దోచుకొనబడి
వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు
పరాక్రమశాలు లందరిని - వారి
బాహు బలమును హరించెను
యాకోబు దేవా నీదు గద్దింపునకు
రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను

3. నీవు భయంకరుడవు దేవా - నీవు
కోపపడు వేళ నిల్చువాడెవడు?
ఆకాశము నుండి తీర్పు వినబడెను
నీవు దేశంబులో శ్రమనొందు వారిని
రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు
భూమి భయమునొంది ఊరకయుండును

4. నరుల కోపము నిన్ను స్తుతించును
వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు
మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి
తన చుట్టు కానుకలు అర్పించవలెను
అధికారుల గర్వమణచి వేయువాడు
భూరాజులకు ఆయన భీకరుడు



Reference: yoodhaaloa dhaevudu prasidhDhudu. ishraayaeluloa aayana naamamu goppadhi. Shaalaemuloa aayana gudaaramunnadhi. seeyoanuloa aayana aalayamunnadhi. keerthana Psalm 76

Chorus: yoodhaaloa dhaevudu prasidhDhudu
ishraayaeluloa thana naamamu goppadhi

Chorus-2: Shaalaemuloa thana gudaaramunnadhi
seeyoanuloa thana aalayamunnadhi

1. akkada viMti agni baaNamulanu
thaanu akkadi kaedemula kaththulanu
akkada yudhDha aayuDhamulanu
thaanu akkadi vaatini virugagottenu
dhuShta mrugamulanu parvathamula yMdhamu
kannanu neeveMthoa thaejoamayudavu

2. kaTinahrudhayulu dhoachukonabadi
vaaru gaaDMbugaa nidhranoMdhi yunnaaru
paraakramashaalu lMdharini - vaari
baahu balamunu hariMchenu
yaakoabu dhaevaa needhu gadhdhiMpunaku
raThasaaraThula kashvamulaku nidhra kalgenu

3. neevu bhayMkarudavu dhaevaa - neevu
koapapadu vaeLa nilchuvaadevadu?
aakaashamu nuMdi theerpu vinabadenu
neevu dhaeshMbuloa shramanoMdhu vaarini
rakShiMchi nyaayapu theerchanu laechunaadu
bhoomi bhayamunoMdhi oorakayuMdunu

4. narula koapamu ninnu sthuthiMchunu
vaari aagraha shaeShmunu DhariMchukoMdhuvu
mee dhaevuni mrokkubaLLu chelliMchudi
thana chuttu kaanukalu arpiMchavalenu
aDhikaarula garvamaNachi vaeyuvaadu
bhooraajulaku aayana bheekarudu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com