• waytochurch.com logo
Song # 3198

prabhuvu selavichchudhaani naalakimthunuప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును



Reference: కృపాసత్యములు కలిసికొనినవి. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి. కీర్తన Psalm 85:8-13

1. ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును
విభుని ప్రజలు శుద్ధులకు సమాధానము

2. వారు మరల బుద్ధిహీనులు గాక యుందురు
గురునికి వారలు జనులుగా నుండెదరు

3. మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా
తన భక్తులకు రక్షణ సమీప మాయెను

4. కృపాసత్యములు ఒకటి నొకటి కలిసికొనినవి
నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనినవి

5. భూలోకము లోనుండి సత్యము మొలుచు
నాకాశములోనుండి నీతి పారజూచును

6. దేవుడుత్తమమైనదాని ననుగ్రహించును
ఈ వసుధర దాని ఫలము లధికమిచ్చును

7. ఆయన ముందు నీతి నడచు చుండునట్లుగా
ఆయన అడుగు జాడలలో మేము నడతుము



Reference: krupaasathyamulu kalisikoninavi. neethi samaaDhaanamulu okadhaaninokati mudhdhupettu koninavi. keerthana Psalm 85:8-13

1. prabhuvu selavichchudhaani naalakiMthunu
vibhuni prajalu shudhDhulaku samaaDhaanamu

2. vaaru marala budhDhiheenulu gaaka yuMdhuru
guruniki vaaralu janulugaa nuMdedharu

3. mana dhaeshamMdhu dhaiva mahima vasiMchunatlugaa
thana bhakthulaku rakShNa sameepa maayenu

4. krupaasathyamulu okati nokati kalisikoninavi
neethi samaaDhaanamulu mudhdhu pettukoninavi

5. bhooloakamu loanuMdi sathyamu moluchu
naakaashamuloanuMdi neethi paarajoochunu

6. dhaevuduththamamainadhaani nanugrahiMchunu
ee vasuDhara dhaani phalamu laDhikamichchunu

7. aayana muMdhu neethi nadachu chuMdunatlugaa
aayana adugu jaadalaloa maemu nadathumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com