mahoannathuni chaatuna vasiyimchuvaadae dhanyumduమహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు
Reference: ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కీర్తన Psalm 91:1-16పల్లవి: మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు1. ఆయనే నా కోట ఆశ్రయము నే నమ్ముకొను దేవుడురక్షించు వేటకాని ఉరి నుండి - పాడు తెగులు నుండి2. తన రెక్కలతో నిను కప్పును నీకు ఆశ్రయంబగునుఆయన సత్యంబు నీ కేడెమును డాలునై యున్నది3. రేయి భయమునకైనా పగటిలో నెగురు బాణమునకైనాచీకటిలో తిరుగు తెగులునకైనా - నీవు భయపడవు4. మధ్యాహ్నములో పాడుచేయు రోగమునకు భయపడవునీ ప్రక్కను వేయి మంది పడినను నీవు భయపడవు5. నీ కుడిప్రక్కను పదివేల మంది కూలిపోయినను - నీవు భయపడవుఅపాయము నీ దాపున కేమాత్రము రాదు భయపడవు6. భక్తిహీనులకు కల్గు ప్రతిఫలము నీవు చూచెదవుమహోన్నతునే ఆశ్రయముగా చేసి వసించు చున్నావు7. నీ గుడారమున కపాయము తెగులు సమీపించదునీ మార్గంబులలో నిను కాపాడను దూతలకు చెప్పున్8. నీ పాదములకు రాయి తగుల నీక నిన్నెత్తు కొందురుసింహములను నాగుల భుజంగములను అణగ ద్రొక్కెదవు9. నన్నెరిగి ప్రేమించె గాన నేను వాని ఘనపరతున్నా నామమున మొఱ్ఱపెట్టగా నేను ఉత్తరమిచ్చెదను10. శ్రమలో తోడై విడిపించి వాని గొప్ప చేసెదనుదీర్ఘాయువుతో తృప్తిపరచి - నా రక్షణ చూపెదను
Reference: aayanae naaku aashrayamu naa koata naenu nammukonu naa dhaevudani naenu yehoavaanu goorchi cheppuchunnaanu. keerthana Psalm 91:1-16Chorus: mahoannathuni chaatuna vasiyiMchuvaadae DhanyuMdu sarvashakthuni needanu vishramiMchu vaadae DhanyuMdu1. aayanae naa koata aashrayamu nae nammukonu dhaevudurakShiMchu vaetakaani uri nuMdi - paadu thegulu nuMdi2. thana rekkalathoa ninu kappunu neeku aashrayMbagunuaayana sathyMbu nee kaedemunu daalunai yunnadhi3. raeyi bhayamunakainaa pagatiloa neguru baaNamunakainaacheekatiloa thirugu thegulunakainaa - neevu bhayapadavu4. maDhyaahnamuloa paaduchaeyu roagamunaku bhayapadavunee prakkanu vaeyi mMdhi padinanu neevu bhayapadavu5. nee kudiprakkanu padhivaela mMdhi koolipoayinanu - neevu bhayapadavuapaayamu nee dhaapuna kaemaathramu raadhu bhayapadavu6. bhakthiheenulaku kalgu prathiphalamu neevu choochedhavumahoannathunae aashrayamugaa chaesi vasiMchu chunnaavu7. nee gudaaramuna kapaayamu thegulu sameepiMchadhunee maargMbulaloa ninu kaapaadanu dhoothalaku cheppun8. nee paadhamulaku raayi thagula neeka ninneththu koMdhurusiMhamulanu naagula bhujMgamulanu aNaga dhrokkedhavu9. nannerigi praemiMche gaana naenu vaani ghanaparathunnaa naamamuna moRRapettagaa naenu uththaramichchedhanu10. shramaloa thoadai vidipiMchi vaani goppa chaesedhanudheerghaayuvuthoa thrupthiparachi - naa rakShNa choopedhanu