• waytochurch.com logo
Song # 3202

sarvoannathuni chaatuna nivasimchedi vaadaeసర్వోన్నతుని చాటున నివసించెడి వాడే



Reference: ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. కీర్తన Psalm 91

1. సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే
సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే

పల్లవి: తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును

2. ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును
ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు

3. పగటి బాణమున కైనా రాత్రి భయమున కైనా
చీకటిలో తిరిగు తెగులుకైనా నేనేమి భయపడను

4. వేయి పదివేలు కుడిప్రక్కను కూలినను
దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు

5. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం
అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు

6. నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్
పాదములకు రాయి తగులకుండ నిన్నెత్తికొందురు

7. కొదమ సింహముల నాగుపాముల నణచెదవు
అతడు నా నామము నెరిగెను అతని తప్పించెదను

8. అతడు నను ప్రేమించెన్ - నామమున మొఱ్ఱపెట్టెన్
అతని విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్



Reference: aayana thana rekkalathoa ninnu kappunu. aayana rekkala kriMdha neeku aashrayamu kalugunu. aayana sathyamu, kaedemunu daalunai yunnadhi. keerthana Psalm 91

1. sarvoannathuni chaatuna nivasiMchedi vaadae
sarvashakthuni needanu vishramiMchunu parama Dhanyatha yidhiyae

Chorus: thana rekkala kriMdha aashrayamu - thana rekkalathoa kappunu

2. aayanae naa aashrayamu - naa koatayu dhurgamunu
aayana sathyamu naa kaedemunu naenammukonu dhaevudu

3. pagati baaNamuna kainaa raathri bhayamuna kainaa
cheekatiloa thirigu thegulukainaa naenaemi bhayapadanu

4. vaeyi padhivaelu kudiprakkanu koolinanu
dhayachoopu dhaevudu neekuMda apaayamu raadhu

5. nee prabhuvaashrayamae yehoavaa nivaasM
apaayamu thegulu - nee gudaaramu sameepiMchavu

6. needhu maargMbulaloa - ninnu dhoothalu kaayun
paadhamulaku raayi thagulakuMda ninneththikoMdhuru

7. kodhama siMhamula naagupaamula naNachedhavu
athadu naa naamamu nerigenu athani thappiMchedhanu

8. athadu nanu praemiMchen - naamamuna moRRapetten
athani vidipiMchi ghanaparathun athani kuththaramiththun


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com