యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలిసికొంటివి
Reference: యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. కీర్తన Psalm 139:1-10
పల్లవి: యెహోవా - నీవు నన్ను పరిశీలించి, తెలిసికొంటివి
నేను కూర్చుం - డుటయు లేచుట
నీకు తెలియును తలంపు నెరుగుదువు
1. పరిశీలించి యున్నావు నీవు నా నడక పడకలను
నా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు
2. యెహోవా మాట నా నాలుకకు రాక - మునుపే యెరుగుదువు
ముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నాపై నుంచితివి
3. నాకు బహుమించియున్నదిట్టి తెలివి - నా కగోచరము
నీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి - పారిపోవుదును
4. నే నాకాశమున కెక్కినప్పటికిని నీ - వచ్చట నున్నావు
పాతాళమందు పండుకొనినను - నీవు అచ్చట నున్నావు
5. సముద్ర దిగంతములలో నేను వేకువ - రెక్కలు కట్టుకొని
వసించిన నీదు హస్తము పట్టుకొని - నన్ను నడిపించున్
Reference: yehoavaa, neevu nannu parishoaDhiMchi thelisikoni yunnaavu. naenu koorchuMduta naenu laechuta neeku theliyunu. naaku thalMpu puttakamunupae neevu naa manassu grahiMchuchunnaavu. keerthana Psalm 139:1-10
Chorus: yehoavaa - neevu nannu parisheeliMchi, thelisikoMtivi
naenu koorchuM - dutayu laechut
neeku theliyunu thalMpu nerugudhuvu
1. parisheeliMchi yunnaavu neevu naa nadaka padakalanu
naa charyalannitini baagugaa neevu yerigiyunnaavu
2. yehoavaa maata naa naalukaku raaka - munupae yerugudhuvu
muMdhu venukala nannaavariMchi nee chaethini naapai nuMchithivi
3. naaku bahumiMchiyunnadhitti thelivi - naa kagoacharamu
nee yaathmanu nee sanniDhini vidichi yechchatiki - paaripoavudhunu
4. nae naakaashamuna kekkinappatikini nee - vachchata nunnaavu
paathaaLamMdhu pMdukoninanu - neevu achchata nunnaavu
5. samudhra dhigMthamulaloa naenu vaekuva - rekkalu kattukoni
vasiMchina needhu hasthamu pattukoni - nannu nadipiMchun