హల్లెలూయ యేసు ప్రభున్ యెల్లరు స్తుతియించుడి
Reference: యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. కీర్తన Psalm 148, 150
1. హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను - తిలకించి స్తుతియించుడి
బలమైన పనిచేయు - బలవంతున్ స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి
పల్లవి: రాజుల రాజైన యేసు రాజు - భూజనులనేలున్
హల్లెలూయ హల్లెలూయ - దేవుని స్తుతియించుడి
2. తంబురతోను వీణతోను - ప్రభువును స్తుతియించుడి
పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళములన్ - మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి
3. సూర్య చంద్రులారా ఇల - దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి
అగ్ని వడగండ్లారా మీరు - కర్తను స్తుతియించుడి
హృదయమును ఒప్పించిన - నాధుని స్తుతియించుడి
4. యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి
5. అగాధమైన జలములారా - దేవుని స్తుతియించుడి
అలల వలె సేవకులు - లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి
Reference: yehoavaanu sthuthiMchudi. aakaashavaasulaaraa, yehoavaanu sthuthiMchudi. unnathasThalamula nivaasulaaraa, aayananu sthuthiMchudi. keerthana Psalm 148, 150
1. hallelooya yaesu prabhun - yellaru sthuthiyiMchudi
vallabhuni charyalanu - thilakiMchi sthuthiyiMchudi
balamaina panichaeyu - balavMthun sthuthiyiMchudi
ellarini sveekariMchu - yaesuni sthuthiyiMchudi
Chorus: raajula raajaina yaesu raaju - bhoojanulanaelun
hallelooya hallelooya - dhaevuni sthuthiyiMchudi
2. thMburathoanu veeNathoanu - prabhuvunu sthuthiyiMchudi
paapamunu rakthamuthoa - thudichenu sthuthiyiMchudi
boorathoanu thaaLamulan - mroagiMchi sthuthiyiMchudi
nirMtharamu maarani - yaesuni sthuthiyiMchudi
3. soorya chMdhrulaaraa ila - dhaevuni sthuthiyiMchudi
hrudhayamunu veligiMchina - yaesuni sthuthiyiMchudi
agni vadagMdlaaraa meeru - karthanu sthuthiyiMchudi
hrudhayamunu oppiMchina - naaDhuni sthuthiyiMchudi
4. yuvakulaaraa pillalaaraa - dhaevuni sthuthiyiMchudi
jeevithamun prabhu panikai - samarpiMchi sthuthiyiMchudi
pedhdhalaaraa prabhuvulaaraa - yehoavaanu sthuthiyiMchudi
aasthulanu yaesunakai - arpiMchi sthuthiyiMchudi
5. agaaDhamaina jalamulaaraa - dhaevuni sthuthiyiMchudi
alala vale saevakulu - laechiri sthuthiyiMchudi
dhoothalaaraa poorva bhakthulaaraa - dhaevuni sthuthiyiMchudi
paramMdhu parishudhDhulu - ellaru sthuthiyiMchudi