kalvariloani shraeshtudaa karunaa bharitha simhamaaకల్వరిలోని శ్రేష్టుడా కరుణా భరిత సింహమా
Reference: నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. 1 కొరింథీయులకు Corinthians 2:2పల్లవి: కల్వరిలోని శ్రేష్టుడా - కరుణా భరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా - నిలువలోని మిత్రుడా1. స్తుతుకి పాత్రుండగువాడా - దూతలతో వెంచేయువాడాసుదతి మరియ పుత్రుడా - సిలువలోని మిత్రుడా2. పాపులకై వచ్చినవాడా - ప్రేమ గల్గిన రక్షకుడాపాదములపై బడితిమి - సిలువలోని మిత్రుడా3. దీవెనల నిచ్చుటకై - వసుధ కేతించినవాడానీవే సుంకరు లాప్తుడవు - సిలువలోని మిత్రుడా4. అయిదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదు వేలజనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా5. నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళ మీద నడిచితివిమేళ్ళ నొసగు మా దాతా - సిలువలోని మిత్రుడా6. రోగుల బాగుచేయువాడా - గ్రుడ్డికి నేత్రము లిచ్చితివిఅనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా7. హల్లెలూయా కర్హుడా - యెల్లరు కొనియాడు వాడాబలముతో వచ్చువాడా - సిలువలోని మిత్రుడా
Reference: naenu siluva vaeyabadina yaesukreesthunu thappa maridhaenini mee maDhya nerugakuMdhunani nishchayiMchukoMtini. 1 koriMTheeyulaku Corinthians 2:2Chorus: kalvariloani shraeShtudaa - karuNaa bharitha siMhamaa kannu bhramiMchu prabhuvaa - niluvaloani mithrudaa1. sthuthuki paathruMdaguvaadaa - dhoothalathoa veMchaeyuvaadaasudhathi mariya puthrudaa - siluvaloani mithrudaa2. paapulakai vachchinavaadaa - praema galgina rakShkudaapaadhamulapai badithimi - siluvaloani mithrudaa3. dheevenala nichchutakai - vasuDha kaethiMchinavaadaaneevae suMkaru laapthudavu - siluvaloani mithrudaa4. ayidhu rottelu mari reMdu - chaepalathoa naidhu vaeljanula poaShiMchina thMdri - siluvaloani mithrudaa5. neeLLanu rasamuga maarchithivi - neeLLa meedha nadichithivimaeLLa nosagu maa dhaathaa - siluvaloani mithrudaa6. roagula baaguchaeyuvaadaa - gruddiki naethramu lichchithivianaaDhula naayakudaa - siluvaloani mithrudaa7. hallelooyaa karhudaa - yellaru koniyaadu vaadaabalamuthoa vachchuvaadaa - siluvaloani mithrudaa