sthoathrimthumu ninu maadhu thmdri sathyamuthoa aathmathoa nepuduస్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెపుడు
Reference: దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. యోహాను John 4:24పల్లవి: స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెపుడుఅను పల్లవి: పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం1. శ్రేష్ఠ యీవుల యూట నీవే - శ్రేష్ఠ కుమారుని యిచ్చినందునత్రిత్వమై యేకత్వమైన త్రి-లోక నాథా శరణం శరణం2. పాపి మిత్రుడ పాప నాశక - పరమవాసా ప్రేమపూర్ణావ్యోమపీఠుడా స్వర్ణమయుడా - పరిశుద్ధాంగుడ శరణం శరణం3. ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడు వాడానను రక్షించిన రక్షకుండవు - నాథ నీవే శరణం శరణం4. బంగారు వెంట్రుకలు తలపై - ఉంగరములుగ కనబడినవివేలలో నతి కాంక్షణీయుడా - వేలకొలది శరణం శరణం5. గువ్వల వంటి కన్నులు - పువ్వుల వంటి చెక్కిళ్ళుమంచి రూపము కలిగినందున - మాకు నీవే శరణం శరణం6. చేతులు బంగారుమయము - చెక్కిన రత్నముల వంటివికాళ్ళు రాతిస్తంభములవలె - కన్పడుచున్నందున శరణం7. సంఘమునకు శిరస్సు నీవే - రాజా నీకే నమస్కారములుముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది శరణం శరణం8. నీదు సేవకుల పునాది - జ్ఞనమునకు మించిన తెలివిఅందముగను కూడుకొనుచు - వేడుకొందుము శరణం శరణం9. రాజ నీకే నమస్కారములు - గీతములు మంగళ ధ్వనులుశుభము శుభము శుభము నిత్యము - హల్లెలూయ ఆమెన్ ఆమెన్
Reference: dhaevudu aathma ganuka aayananu aaraaDhiMchuvaaru aathmathoanu sathyamuthoanu aaraaDhiMpavalenanenu. yoahaanu John 4:24Chorus: sthoathriMthumu ninu maadhu thMdri sathyamuthoa aathmathoa nepuduChorus-2: parishudhDhaalMkaaramulathoa dharshiMchedhamu sharaNM sharaNM1. shraeShTa yeevula yoota neevae - shraeShTa kumaaruni yichchinMdhunthrithvamai yaekathvamaina thri-loaka naaThaa sharaNM sharaNM2. paapi mithruda paapa naashaka - paramavaasaa praemapoorNaavyoamapeeTudaa svarNamayudaa - parishudhDhaaMguda sharaNM sharaNM3. DhavaLavarNuda rathnavarNuda - sathyaroopi yanabadu vaadaananu rakShiMchina rakShkuMdavu - naaTha neevae sharaNM sharaNM4. bMgaaru veMtrukalu thalapai - uMgaramuluga kanabadinavivaelaloa nathi kaaMkShNeeyudaa - vaelakoladhi sharaNM sharaNM5. guvvala vMti kannulu - puvvula vMti chekkiLLumMchi roopamu kaliginMdhuna - maaku neevae sharaNM sharaNM6. chaethulu bMgaarumayamu - chekkina rathnamula vMtivikaaLLu raathisthMbhamulavale - kanpaduchunnMdhuna sharaNM7. sMghamunaku shirassu neevae - raajaa neekae namaskaaramulumukhyamaina moolaraayi - koatlakoladhi sharaNM sharaNM8. needhu saevakula punaadhi - jnYnamunaku miMchina theliviaMdhamuganu koodukonuchu - vaedukoMdhumu sharaNM sharaNM9. raaja neekae namaskaaramulu - geethamulu mMgaLa Dhvanulushubhamu shubhamu shubhamu nithyamu - hallelooya aamen aamen