• waytochurch.com logo
Song # 325

velpulalo bahu ghanudu వేల్పులలో బహు ఘనుడా యేసయ్యా


వేల్పులలో బహు ఘనుడా -యేసయ్యా

నిను సేవించువారిని - ఘనపరతువు

నిను ప్రేమించువారికి సమస్తము - సమకూర్చి జరిగింతువు

నీ యందు భయభక్తి గల వారికీ - శాశ్వత కృపనిచ్చెదవు



1. సుందరుడైన యోసేపును - అంధకార బంధువర్గాలలో

పవిత్రునిగ నిలిపావు - ఫలించెడి కొమ్మగ చేశావు

మెరుగుపెట్టి నను దాచావు - నీ అంబుల పొదిలో

ఘనవిజయమునిచ్చుట కొరకు - తగిన సమయములో



2. ఉత్తముడైన దావీదును - ఇరుకులేని విశాల స్థలములో

ఉన్నత కృపతో నింపావు - ఊహించని స్థితిలో నిలిపావు

విలువపెట్టి నను కొన్నావు - నీ అమూల్య రక్తముతో

నిత్య జీవమునిచ్చుట కొరకు - మహిమ రాజ్యములో



3. పామరుడైన సీమోనును - కొలతలేని ఆత్మాభిషేకముతో

అజ్ఞానము తొలగించావు - విజ్ఞాన సంపదనిచ్చావు

పేరుపెట్టి నను పిలిచావు - నిను పోలినడుచుటకు

చెప్ప శక్యము కాని ప్రహర్షముతో - నిను స్తుతించెదను


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com