• waytochurch.com logo
Song # 3253

smsthuthimthumu ninnae saulunu vidachithiviసంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివి



Reference: నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము. 1 సమూయేలు Samuel 16:12

1. సంస్తుతింతుము నిన్నే - సౌలును విడచితివి
దావీదును కోరుకొని - దీవించిన యెహోవా

2. యెష్షయి పుత్రులలో - ఎర్రని వాడతడు
నేత్రాలు చక్కనివి - నేర్పరి మాటలలోన

3. రత్నవర్ణుడు యేసు - మాటలు దయగలవి
గువ్వలవలె వెలయు - కన్నులు గలవాడేసు

4. బెత్లెహేమునందు - ఖ్యాతిగా వాయించి
సొంపగు పాటలు పాడే - సుగుణాల సుందరుడు

5. పరమగీతము పాడే - పావనుడు మన యేసు
నేర్పరి మాటలలోన - నజరేతు నివాసి

6. వీరుడగు యౌవనుడు - శూరుడు యుద్ధమున
తల్లిని మించి యెహోవా - తనతోడై యున్నాడు

7. నేను కోరిన దితడే - వాని అన్నలముందు
అభిషేక తైలముతో - అభిషేకించుము వాని

8. సంఘవరుడగు క్రీస్తు - సత్యముగ మన శిరస్సు
ఆత్మాభిషిక్తుండై - అలరారుచున్నాడు



Reference: naenu koarukonnavaadu ithadae, neevu laechi vaanini abhiShaekiMchumu. 1 samooyaelu Samuel 16:12

1. sMsthuthiMthumu ninnae - saulunu vidachithivi
dhaaveedhunu koarukoni - dheeviMchina yehoavaa

2. yeShShyi puthrulaloa - errani vaadathadu
naethraalu chakkanivi - naerpari maatalaloan

3. rathnavarNudu yaesu - maatalu dhayagalavi
guvvalavale velayu - kannulu galavaadaesu

4. bethlehaemunMdhu - khyaathigaa vaayiMchi
soMpagu paatalu paadae - suguNaala suMdharudu

5. paramageethamu paadae - paavanudu mana yaesu
naerpari maatalaloana - najaraethu nivaasi

6. veerudagu yauvanudu - shoorudu yudhDhamun
thallini miMchi yehoavaa - thanathoadai yunnaadu

7. naenu koarina dhithadae - vaani annalamuMdhu
abhiShaeka thailamuthoa - abhiShaekiMchumu vaani

8. sMghavarudagu kreesthu - sathyamuga mana shirassu
aathmaabhiShikthuMdai - alaraaruchunnaadu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com