jeevinchuchunnadhi nenu khadhu జీవించుచున్నది నేను కాదు
జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను క్రీస్తే నాలో జీవించుచున్నాడు 1. నేను నా సొత్తు కానేకాను క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు యేసయ్య చిత్తమే నాలో నెరవేరుచున్నది ॥ జీవించు ॥ 2. యుద్ధము నాది కానేకాదు యుద్ధము యేసయ్యదే నా పక్షమున జయమసలే నాది కానేకాదు యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు ॥ జీవించు ॥ 3. లోకము నాది కానేకాదు యాత్రికుడను పరదేశిని నాకు నివాసము లేనేలేదు యేసయ్య నివాసము నాకిచ్చినాడు ॥ జీవించు ॥