• waytochurch.com logo
Song # 3270

dhaevadhaevuni koniyaadedhamu aviratha thriyaekuni sthoathrimthumuదేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము



Reference: దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. కీర్తన Psalm 136:2

పల్లవి: దేవదేవుని కొనియాడెదము - అవిరత త్రియేకుని స్తోత్రింతుము

అను పల్లవి: ఏపుగా దయాళుని పొగడెదము
పాప పరిహారుని పాడెదము

1. దూతలు స్తుతించు మహోన్నతుడు
కన్యమరియ యందు జన్మించెను
మహియందు చీకటి పోగొట్టి
ఇహపర సుఖముల దయచేసెను

2. పాపశాపమును తీర్చను
పాట్లుపడెను దేవ గొర్రెపిల్ల
హా! మంచి గొఱ్ఱెల బోయడే
ప్రాణము నిచ్చెను మనకై

3. పాపముల కడిగి రక్షించెను
కృపనిచ్చె వేచియుండుటకై
వైరిని జయింపను శక్తినిచ్చె
నరులకు భాగ్యము నందించెను

4. ఆకాశము నుండి దిగి వచ్చును
లోకమున్ న్యాయము తీర్చుటకై
ఆయత్తముగ కాచియుండెదరు
పాయక వివేక కన్యల వలె

5. తన స్వరూపము నే దాల్చను
ఆయనే నా రూపము దాల్చెన్
దాసుడనగు నన్ను రక్షింపన్
యేసు నరరూపము దాల్చెన్

6. పాతాళ లోకము కూల్చవచ్చెన్
జాతి యడ్డుగోడ పడగొట్టెను
నిత్య జీవంబు నియ్యను వచ్చెను
నీతి సూర్యుడు ప్రభు యేసువే

7. హల్లెలూయ పాడి ఆర్భటింతుము
హర్షముతో యేసున్ చాటెదము
బలుడైన తండ్రిని కీర్తింతుము
విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము



Reference: dhaevadhaevuniki kruthajnYthaasthuthulu chelliMchudi. aayana krupa nirMtharamuMdunu. keerthana Psalm 136:2

Chorus: dhaevadhaevuni koniyaadedhamu - aviratha thriyaekuni sthoathriMthumu

Chorus-2: aepugaa dhayaaLuni pogadedhamu
paapa parihaaruni paadedhamu

1. dhoothalu sthuthiMchu mahoannathudu
kanyamariya yMdhu janmiMchenu
mahiyMdhu cheekati poagotti
ihapara sukhamula dhayachaesenu

2. paapashaapamunu theerchanu
paatlupadenu dhaeva gorrepill
haa! mMchi goRRela boayadae
praaNamu nichchenu manakai

3. paapamula kadigi rakShiMchenu
krupanichche vaechiyuMdutakai
vairini jayiMpanu shakthinichche
narulaku bhaagyamu nMdhiMchenu

4. aakaashamu nuMdi dhigi vachchunu
loakamun nyaayamu theerchutakai
aayaththamuga kaachiyuMdedharu
paayaka vivaeka kanyala vale

5. thana svaroopamu nae dhaalchanu
aayanae naa roopamu dhaalchen
dhaasudanagu nannu rakShiMpan
yaesu nararoopamu dhaalchen

6. paathaaLa loakamu koolchavachchen
jaathi yaddugoada padagottenu
nithya jeevMbu niyyanu vachchenu
neethi sooryudu prabhu yaesuvae

7. hallelooya paadi aarbhatiMthumu
harShmuthoa yaesun chaatedhamu
baludaina thMdrini keerthiMthumu
viluva shudhDhaathmanu shlaaghiMthumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com