• waytochurch.com logo
Song # 3273

jai jai jai jai raajula raajaa paathruda veevae maa prabhu veevaeజై జై జై జై రాజుల రాజా పాత్రుడ వీవే మా ప్రభు వీవే



Reference: ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను. 2 కొరింథీయులకు Corinthians 8:9

పల్లవి: జై జై జై జై రాజుల రాజా
పాత్రుడ వీవే మా ప్రభు వీవే

1. అన్ని కాలములలో నీ నామము
మహోన్నతము మహోన్నతుడా
వాగ్దానము నెరవేర్చిన దేవా
మాట తప్పని మహోపకారి

2. దూతల మాదిరి గీతముల్ పాడుచు
సతతము నిన్నే స్తోత్రించెదము
గొల్లలు గాంచిన ఘన కాపరి మా
ఉల్లము నందు ఉల్లసించెదము

3. తూర్పున తారను గాంచిన జ్ఞానులు
రాజుల రాజ నీవే యనుచు
బంగారము సాంబ్రాణి బోళమును
అర్పించి ఆరాధించిరిగా

4. ధనవంతుడవగు ఓ మా ప్రభువా
ధనహీనుడుగా నైతివి మాకై
మా దారిద్ర్యము తీసివేయ
నరరూపమున జన్మించితివి

5. యేసు ప్రభుండా రక్తము కార్చి
ఎంచి మమ్ము విమోచించితివి
ఎంచలేను నీ మేలుల నెపుడు
ఎన్నదగిన మా దేవుడ నీవే

6. మాకై సిలువలో మరణించితివి
మరణపు ముల్లును విరచిన ప్రభువా
యుగయుగములకు నీకే మహిమ
నిరతము స్తోత్రము హల్లెలూయ



Reference: aayana DhanavMthudai yuMdiyu meeru thana dhaaridhryamu valana DhanavMthulu kaavalenani, mee nimiththamu dharidhrudaayenu. 2 koriMTheeyulaku Corinthians 8:9

Chorus: jai jai jai jai raajula raajaa
paathruda veevae maa prabhu veevae

1. anni kaalamulaloa nee naamamu
mahoannathamu mahoannathudaa
vaagdhaanamu neravaerchina dhaevaa
maata thappani mahoapakaari

2. dhoothala maadhiri geethamul paaduchu
sathathamu ninnae sthoathriMchedhamu
gollalu gaaMchina ghana kaapari maa
ullamu nMdhu ullasiMchedhamu

3. thoorpuna thaaranu gaaMchina jnYaanulu
raajula raaja neevae yanuchu
bMgaaramu saaMbraaNi boaLamunu
arpiMchi aaraaDhiMchirigaa

4. DhanavMthudavagu oa maa prabhuvaa
Dhanaheenudugaa naithivi maakai
maa dhaaridhryamu theesivaey
nararoopamuna janmiMchithivi

5. yaesu prabhuMdaa rakthamu kaarchi
eMchi mammu vimoachiMchithivi
eMchalaenu nee maelula nepudu
ennadhagina maa dhaevuda neevae

6. maakai siluvaloa maraNiMchithivi
maraNapu mullunu virachina prabhuvaa
yugayugamulaku neekae mahim
nirathamu sthoathramu hallelooy



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com