• waytochurch.com logo
Song # 3279

oa praemagala yaesu praemimchinaavu mammuఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము



Reference: మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్‌. ప్రకటన Revelation 1:6

పల్లవి: ఓ ప్రేమగల యేసు - ప్రేమించినావు మమ్ము
స్మరించుచు స్తుతింతున్ - రక్షణ నిచ్చినావు

1. అద్భుత యాగమందు - అందరికై బలియై
అందరి పాపములకు - ప్రాయశ్చిత్తమైతివి

2. దాసులమై మేముండ - మోషేను పంపితివి
చేసితివి స్వతంత్రులుగా - నీ బాహుబలము తోడ

3. క్షమాపణానందముతో - సాగింపచేసి మమ్ము
యాత్రలో మాకు తోడై - విజయము నిచ్చితివి

4. ఎడారి అడవిలోన - ఊటల నదులు నడిపి
ఎండిన నేలనంత - పచ్చిక బయలు చేసెన్

5. బాబెలు నుండి మమ్ము - విడిపించితివి నీవు
బంధకముల తెంచి - తప్పు బోధ బాపినావు

6. సహవాసమిచ్చి సంఘ - అంగముల జేసినావు
సాక్షులను చేసి మమ్ము - శత్రువుల సిగ్గుపరచె

7. మహా ప్రేమ గల యేసు - మాకై చేసితివన్ని
ఘనపరతు హల్లెలూయ - ఈ గొప్ప రక్షణ కొరకు



Reference: manalanu praemiMchuchu thana rakthamuvalana mana paapamulanuMdi manalanu vidipiMchinavaaniki mahimayu prabhaavamunu yugayugamulu kalugunugaaka aamaen‌. prakatana Revelation 1:6

Chorus: oa praemagala yaesu - praemiMchinaavu mammu
smariMchuchu sthuthiMthun - rakShNa nichchinaavu

1. adhbhutha yaagamMdhu - aMdharikai baliyai
aMdhari paapamulaku - praayashchiththamaithivi

2. dhaasulamai maemuMda - moaShaenu pMpithivi
chaesithivi svathMthrulugaa - nee baahubalamu thoad

3. kShmaapaNaanMdhamuthoa - saagiMpachaesi mammu
yaathraloa maaku thoadai - vijayamu nichchithivi

4. edaari adaviloana - ootala nadhulu nadipi
eMdina naelanMtha - pachchika bayalu chaesen

5. baabelu nuMdi mammu - vidipiMchithivi neevu
bMDhakamula theMchi - thappu boaDha baapinaavu

6. sahavaasamichchi sMgha - aMgamula jaesinaavu
saakShulanu chaesi mammu - shathruvula sigguparache

7. mahaa praema gala yaesu - maakai chaesithivanni
ghanaparathu hallelooya - ee goppa rakShNa koraku


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com