oa praemagala yaesu praemimchinaavu mammuఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము
Reference: మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ప్రకటన Revelation 1:6పల్లవి: ఓ ప్రేమగల యేసు - ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ - రక్షణ నిచ్చినావు1. అద్భుత యాగమందు - అందరికై బలియైఅందరి పాపములకు - ప్రాయశ్చిత్తమైతివి2. దాసులమై మేముండ - మోషేను పంపితివిచేసితివి స్వతంత్రులుగా - నీ బాహుబలము తోడ3. క్షమాపణానందముతో - సాగింపచేసి మమ్ముయాత్రలో మాకు తోడై - విజయము నిచ్చితివి4. ఎడారి అడవిలోన - ఊటల నదులు నడిపిఎండిన నేలనంత - పచ్చిక బయలు చేసెన్5. బాబెలు నుండి మమ్ము - విడిపించితివి నీవుబంధకముల తెంచి - తప్పు బోధ బాపినావు6. సహవాసమిచ్చి సంఘ - అంగముల జేసినావుసాక్షులను చేసి మమ్ము - శత్రువుల సిగ్గుపరచె7. మహా ప్రేమ గల యేసు - మాకై చేసితివన్నిఘనపరతు హల్లెలూయ - ఈ గొప్ప రక్షణ కొరకు
Reference: manalanu praemiMchuchu thana rakthamuvalana mana paapamulanuMdi manalanu vidipiMchinavaaniki mahimayu prabhaavamunu yugayugamulu kalugunugaaka aamaen. prakatana Revelation 1:6Chorus: oa praemagala yaesu - praemiMchinaavu mammu smariMchuchu sthuthiMthun - rakShNa nichchinaavu1. adhbhutha yaagamMdhu - aMdharikai baliyaiaMdhari paapamulaku - praayashchiththamaithivi2. dhaasulamai maemuMda - moaShaenu pMpithivichaesithivi svathMthrulugaa - nee baahubalamu thoad3. kShmaapaNaanMdhamuthoa - saagiMpachaesi mammuyaathraloa maaku thoadai - vijayamu nichchithivi4. edaari adaviloana - ootala nadhulu nadipieMdina naelanMtha - pachchika bayalu chaesen5. baabelu nuMdi mammu - vidipiMchithivi neevubMDhakamula theMchi - thappu boaDha baapinaavu6. sahavaasamichchi sMgha - aMgamula jaesinaavusaakShulanu chaesi mammu - shathruvula sigguparache7. mahaa praema gala yaesu - maakai chaesithivannighanaparathu hallelooya - ee goppa rakShNa koraku