• waytochurch.com logo
Song # 328

dheva ni krupa nirantharam దేవా నీ కృప నిరంతరం మారనిదెపుడు నా ప్రభువా


దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా

నిత్యజీవము గలది ప్రియ ప్రభువా .....

దేవా! నీ కృప నిరంతరం




1. పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే -2

పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే -2 ॥ దేవా ॥




2. రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే -2

నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే -2 ॥ దేవా ॥




3. విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే -2

శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే -2 ॥ దేవా ॥




4. కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా -2

నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము -2 ॥ దేవా ॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com