vmdhanamoa vmdhana maesayyవందనమో వందన మేసయ్య
Reference: శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. యూదా Jude 25పల్లవి: వందనమో వందన మేసయ్య - అందుకొనుము మా దేవా మాదు - వందన మందుకొనుమయా1. ధరకేతించి ధరియించితివా - నరరూపమును నరలోకములోమరణము నొంది మరిలేచిన మా మారని మహిమ రాజానీకిదే వందన మందుకొనుమయా2. పాపిని జూచి ప్రేమను జూపి - కరుణా కరముచే కల్వరి కడకునడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీప్రేమకు సాటియే లేదిలలోన3. ఉదయించితివా నన్నుద్ధరింప - ధరియించితివా దారుణ మరణముదయతలచి దరిద్రుని పిలిచి దారిని చూపిన దాతాదేవా హృదయార్పణ నర్పింతు4. అనాధుండను నా నాథుండా - అండవై నాకు బండగ నుండుఅంధుడ నేను నా డెందమున నుండి నడిపించుక్రీస్తుండా స్తుతిపాత్రుండ - స్తుతించు5. జగమును వీడి పరమున కరిగి - పరిశుద్ధాత్మను వరమును విరివిగనరులపై వరదా ధరలో పోసిన దురిత దూరుడ రావారాజా నీకిదే నా స్తుతియాగం6. పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతోప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చుక్షితినిన్ చేరి స్తుతింతు7. స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడా - వర్ణనాతీతుడా ధవళవర్ణుడారత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతానీకిదే వందనమందుకొనుమయా
Reference: shakthigala mana rakShkudaina adhvitheeya dhaevuniki, mana prabhuvaina yaesu kreesthudhvaaraa, mahimayu mahaathmyamunu aaDhipathyamunu aDhikaaramunu yugamulaku poorvamunu ippudunu sarvayugamulunu kalugunu gaaka. yoodhaa Jude 25Chorus: vMdhanamoa vMdhana maesayya - aMdhukonumu maa dhaevaa maadhu - vMdhana mMdhukonumayaa1. DharakaethiMchi DhariyiMchithivaa - nararoopamunu naraloakamuloamaraNamu noMdhi marilaechina maa maarani mahima raajaaneekidhae vMdhana mMdhukonumayaa2. paapini joochi praemanu joopi - karuNaa karamuchae kalvari kadakunadipiMchi kadu praemathoa kadigi kanneetini thudichina neepraemaku saatiyae laedhilaloan3. udhayiMchithivaa nannudhDhariMpa - DhariyiMchithivaa dhaaruNa maraNamudhayathalachi dharidhruni pilichi dhaarini choopina dhaathaadhaevaa hrudhayaarpaNa narpiMthu4. anaaDhuMdanu naa naaThuMdaa - aMdavai naaku bMdaga nuMduaMDhuda naenu naa deMdhamuna nuMdi nadipiMchukreesthuMdaa sthuthipaathruMda - sthuthiMchu5. jagamunu veedi paramuna karigi - parishudhDhaathmanu varamunu virivignarulapai varadhaa Dharaloa poasina dhuritha dhooruda raavaaraajaa neekidhae naa sthuthiyaagM6. paramunuMdi parishudhDhulathoa paripoorNa prabhu prabhaavamuthoapravimaludaa prathyakShMbagudhuvu akShya dhaehamu thakShNamichchukShithinin chaeri sthuthiMthu7. sthuthisthoathraarhudaa parama poojyudaa - varNanaatheethudaa DhavaLavarNudaarathnavarNuda rikthudavaithivi mukthinichchina dhaathaaneekidhae vMdhanamMdhukonumayaa