sariraarevaru naa priyudyna yesayaku సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -21. నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే -2 నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే -2 సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2 2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే -2 ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే -2సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -23. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే -2 శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే -2 సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2