• waytochurch.com logo
Song # 3299

mahaaghanudu mahoannathudu parishudhdhudu nithyanivaasiమహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనివాసి



Reference: మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్యనివాసి యెషయా Isaiah 57:15

పల్లవి: మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనివాసి
మా సాఅమర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణనిధి

1. ఉన్నత పరిశుద్ధ స్థలములలో
నివసించువాడు పరిశుద్ధుడు
అయినను - నలిగిన వినయంపు
దీనమనస్సులో నివసించును జీవించును

2. దినమెల్ల ప్రభుకై వధియింప
బడి యున్నట్టి గొర్రెలము
అయినను - ప్రేమించినవాని
ప్రేమను బట్టియే పొందితిమి విజయమును

3. మోసము శిక్షయు దుఃఖమును
దరిద్రత కలిగియున్నాము
అయినను - సత్యము జీవము
సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి

4. పడిపోయి మేముంటిమి
అంధకారమందుంటిమిగా
అయినను - తిరిగి లేతుము
యెహోవాయే మా వెలుగు మా రక్షణ

5. మన క్రీస్తును బట్టి యెల్లప్పుడు
నిందకు పాత్రులమైతిమి
అయినను - ఎల్లప్పుడు వూరేగించును
మమ్ము విజయముతో స్తోత్రములు



Reference: mahaaghanudunu, mahoannathudunu, parishudhDhudunu, nithyanivaasi yeShyaa Isaiah 57:15

Chorus: mahaaghanudu mahoannathudu parishudhDhudu nithyanivaasi
maa saaamarThyamu punaruthThaanamu maa jeevamu maa rakShNaniDhi

1. unnatha parishudhDha sThalamulaloa
nivasiMchuvaadu parishudhDhudu
ayinanu - naligina vinayMpu
dheenamanassuloa nivasiMchunu jeeviMchunu

2. dhinamella prabhukai vaDhiyiMp
badi yunnatti gorrelamu
ayinanu - praemiMchinavaani
praemanu battiyae poMdhithimi vijayamunu

3. moasamu shikShyu dhuHkhamunu
dharidhratha kaligiyunnaamu
ayinanu - sathyamu jeevamu
sMthoaShmunu aishvaryamul poMdhithimi

4. padipoayi maemuMtimi
aMDhakaaramMdhuMtimigaa
ayinanu - thirigi laethumu
yehoavaayae maa velugu maa rakShN

5. mana kreesthunu batti yellappudu
niMdhaku paathrulamaithimi
ayinanu - ellappudu vooraegiMchunu
mammu vijayamuthoa sthoathramulu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com