dhaevaa naaymdhu neeku emthoa praemaaదేవా నాయందు నీకు ఎంతో ప్రేమా
Reference: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను. యిర్మియా Jeremiah 31:3
పల్లవి: దేవా నాయందు నీకు - ఎంతో ప్రేమా
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
హల్లెలూయ ... (4)
1. దిన దినము నీదు ప్రేమ - రుచిచూచుచున్నాను
దయగల జీవాహారముతో - పోషించుచున్నావు
దేవా! నీ జీవ జలము - నాకిచ్చితివే
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
2. నా పాదములను నీవు - బండపై నిలిపితివి
నా యడుగుల నెల్ల నీవు - స్థిరపరచిన దేవుడవు
దేవా! నా కాశ్రయుడవు - నీవే కదా
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
3. సిలువలో నీ రక్తము కార్చి - నన్ను రక్షించితివి
సార్వత్రిక సంఘములోన - నన్నైక్య పరచితివి
దేవా నీ దయ నా యెడల - అత్యున్నతము
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
4. వాగ్దానములను నాలో - నెరవేర్చిన ఓ ప్రభువా
విదువక నా యెడల నీదు - కృప జూపుచున్నావు
దేవా! నీ మారని ప్రేమ - సంపూర్ణము
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
5. మృతిని గెల్చి మాకొరకై - తిరిగి లేచిన ప్రభువా
మా కొరకై త్వరలో రానై - యున్న మహిమ రాజా
దేవా! నీ సన్నిధి నాకు - ఎంతో ప్రియము
నీ దివ్య ప్రేమ నాలో - ఉప్పొంగెను
Reference: shaashvathamaina praemathoa naenu ninnu praemiMchuchunnaanu ganuka viduvaka neeyedala krupa choopuchunnaanu. yirmiyaa Jeremiah 31:3
Chorus: dhaevaa naayMdhu neeku - eMthoa praemaa
nee dhivya praema naaloa - uppoMgenu
hallelooya ... (4)
1. dhina dhinamu needhu praema - ruchichoochuchunnaanu
dhayagala jeevaahaaramuthoa - poaShiMchuchunnaavu
dhaevaa! nee jeeva jalamu - naakichchithivae
nee dhivya praema naaloa - uppoMgenu
2. naa paadhamulanu neevu - bMdapai nilipithivi
naa yadugula nella neevu - sThiraparachina dhaevudavu
dhaevaa! naa kaashrayudavu - neevae kadhaa
nee dhivya praema naaloa - uppoMgenu
3. siluvaloa nee rakthamu kaarchi - nannu rakShiMchithivi
saarvathrika sMghamuloana - nannaikya parachithivi
dhaevaa nee dhaya naa yedala - athyunnathamu
nee dhivya praema naaloa - uppoMgenu
4. vaagdhaanamulanu naaloa - neravaerchina oa prabhuvaa
vidhuvaka naa yedala needhu - krupa joopuchunnaavu
dhaevaa! nee maarani praema - sMpoorNamu
nee dhivya praema naaloa - uppoMgenu
5. mruthini gelchi maakorakai - thirigi laechina prabhuvaa
maa korakai thvaraloa raanai - yunna mahima raajaa
dhaevaa! nee sanniDhi naaku - eMthoa priyamu
nee dhivya praema naaloa - uppoMgenu