• waytochurch.com logo
Song # 331

praneswara prabhu dhiva kumara ప్రాణేశ్వర ప్రభు దైవకుమార


ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార

ప్రణుతింతును నిన్నే- ఆశతీర
ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార

1. నా ఆత్మతో పాటలు పాడ - నీ కృపలే నాకు హేతువులాయె -2
నిత్య నిబంధన నీతో చేసి - నీ పాద సన్నిధి చేరియున్నానే -2
॥ ప్రాణేశ్వర ॥
2. నా ఊటలన్నియు నీ యందేనని - వాద్యము వాయించి పాడెదను -2
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి - సాగెద నూతన యెరూషలేము -2
॥ ప్రాణేశ్వర ॥
3. కమనీయమైన నీ దర్శనము - కలనైనను మెలకువనైన -2
కనబడినా నా ఆశలు తీరవే - కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి -2
॥ ప్రాణేశ్వర ॥

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com