praneswara prabhu dhiva kumara ప్రాణేశ్వర ప్రభు దైవకుమార
ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార 1. నా ఆత్మతో పాటలు పాడ - నీ కృపలే నాకు హేతువులాయె -2 నిత్య నిబంధన నీతో చేసి - నీ పాద సన్నిధి చేరియున్నానే -2 ॥ ప్రాణేశ్వర ॥2. నా ఊటలన్నియు నీ యందేనని - వాద్యము వాయించి పాడెదను -2 జీవిత కాలమంతా నిన్నే స్తుతించి - సాగెద నూతన యెరూషలేము -2 ॥ ప్రాణేశ్వర ॥3. కమనీయమైన నీ దర్శనము - కలనైనను మెలకువనైన -2 కనబడినా నా ఆశలు తీరవే - కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి -2 ॥ ప్రాణేశ్వర ॥