• waytochurch.com logo
Song # 3315

yaesu prabhoo gadhdhepainunna neeku maa sthuthulanu chellimchedhamuయేసు ప్రభూ గద్దెపైనున్న నీకు మా స్తుతులను చెల్లించెదము



Reference: ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేసిరి. Revelation ప్రకటన 4:10

1. యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు
మా స్తుతులను చెల్లించెదము
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండ వీవంచు కీర్తింతుము

పల్లవి: పాత్రుండవీవే పాత్రుండవీవే
పాత్రుండవీవే మాప్రభు నీవే
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండవీవంచు కీర్తింతుము

2. దేవుడౌ నీవు నరరూపమెత్తి
దూతలకన్న తగ్గింపబడి
స్త్రీ సంతానమౌ నీవు మరణించి
సర్పము తల నణగ ద్రొక్కితివి

3. నీ సృష్టియే సిల్వయొద్దకు నిన్ను
నడ్పి సిల్వన్ మేకులతో కొట్టిరి
దైవ మానవులచే వీడబడి
శాప నష్ట మనుభవించితివి

4. మహిమతో మరణమును గెల్చి
గొప్ప విజయము పొందితివి
చావు సమాధులపై విజయుండా
నిన్ను స్తుతింపక నెట్టులుందును


Reference: aa yiruvadhi naluguru pedhdhalu siMhaasanamunMdhu aaseenudai yuMduvaani yedhuta saagilapadi, yugayugamulu jeeviMchuchunna vaaniki namaskaaramu chaesiri. Revelation prakatana 4:10

1. yaesu prabhoo gadhdhepainunna neeku
maa sthuthulanu chelliMchedhamu
nee sanniDhiyMdhu ninnaaraaDhiMchi
paathruMda veevMchu keerthiMthumu

Chorus: paathruMdaveevae paathruMdaveevae
paathruMdaveevae maaprabhu neevae
nee sanniDhiyMdhu ninnaaraaDhiMchi
paathruMdaveevMchu keerthiMthumu

2. dhaevudau neevu nararoopameththi
dhoothalakanna thaggiMpabadi
sthree sMthaanamau neevu maraNiMchi
sarpamu thala naNaga dhrokkithivi

3. nee sruShtiyae silvayodhdhaku ninnu
nadpi silvan maekulathoa kottiri
dhaiva maanavulachae veedabadi
shaapa naShta manubhaviMchithivi

4. mahimathoa maraNamunu gelchi
goppa vijayamu poMdhithivi
chaavu samaaDhulapai vijayuMdaa
ninnu sthuthiMpaka nettuluMdhunu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com