• waytochurch.com logo
Song # 3337

needhu vishvaasyatha maa prabhu yaesu amtharikshmu nadhigamimchenuనీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెను



Reference: కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడునని నీవు తెలిసికొనవలెను. ద్వితీ Deuteronomy 7:9

Reference: యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది. కీర్తన Psalm 36:5

Reference: సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. 1 థెస్స Thessalonians 5:23-24

Reference: అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైన నమ్మదగినవాడవు. విలాప Lamentations 3:23

పల్లవి: నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు
అంతరిక్షము నధిగమించెను

1. నిను ప్రేమించి నీ ఆజ్ఞలను
అనుసరించు మనుజావళికి
నిబంధనను స్థిరముగ జేసి
నిరతము నలరారెడు మా ప్రభువా

2. వేయి తరముల వరకు సరిగా
విలసిల్లేటి వెలలేని మా
వింతల కృపాంబుధి యగుదేవా
యెంతయో నిను స్తుతియింతుము కోరి

3. నీ సత్య సంధత్వ మహిమ
నిరతము నిలయం సంస్తుతులకు
మెరసెను నా మదిలోన దేవా
మరువగ లేమీ మధుర ప్రేమ

4. ఎంతైనను నమ్మదగిన
వింతైన నీ విశ్వాస్యత
వాత్సల్యత వెలసెను మాపై
క్రొత్తగ ప్రతి దినము యేసు ప్రభో

5. మన ఆత్మనుజీవము దేహమును
మన ప్రభుయేసు రాకడవరకు
వొసరుగ కాపాడును పదిలముగా
దిన దినమును నిందారహితముగ

6. తండ్రికుమార శుద్ధాత్మకును
తర తరములకు మహిమ ఘనత
పరిపూర్ణముగా ప్రబలును గాక
పరిపరి విధముల ప్రభు సంఘములో



Reference: kaabatti nee dhaevudaina yehoavaa thaanae dhaevudaniyu, thannu praemiMchi thana aajnYla nanusariMchi naduchukonuvaariki thana nibMDhananu sThiraparachuvaadunu vaeyitharamulavaraku krupachoopuvaadunu nammathagina dhaevudunani neevu thelisikonavalenu. dhvithee Deuteronomy 7:9

Reference: yehoavaa nee krupa aakaashamu nMtuchunnadhi. nee sathyasMDhathvamu aMtharikShmu nMtuchunnadhi. keerthana Psalm 36:5

Reference: samaaDhaanakarthayagu dhaevudae mimmunu sMpoorNamugaa parishudhDhaparachunu gaaka. mee aathmayu jeevamunu shareeramunu mana prabhuvaina yaesukreesthu raakadayMdhu niMdhaarahithamugaanu, sMpoorNamugaanu uMdunatlu kaapaadabadunu gaaka. 1 Thessa Thessalonians 5:23-24

Reference: anudhinamu noothanamugaa aayanaku vaathsalyatha puttuchunnadhi. neevu eMthaina nammadhaginavaadavu. vilaapa Lamentations 3:23

Chorus: needhu vishvaasyatha maa prabhu yaesu
aMtharikShmu naDhigamiMchenu

1. ninu praemiMchi nee aajnYlanu
anusariMchu manujaavaLiki
nibMDhananu sThiramuga jaesi
nirathamu nalaraaredu maa prabhuvaa

2. vaeyi tharamula varaku sarigaa
vilasillaeti velalaeni maa
viMthala krupaaMbuDhi yagudhaevaa
yeMthayoa ninu sthuthiyiMthumu koari

3. nee sathya sMDhathva mahim
nirathamu nilayM sMsthuthulaku
merasenu naa madhiloana dhaevaa
maruvaga laemee maDhura praem

4. eMthainanu nammadhagin
viMthaina nee vishvaasyath
vaathsalyatha velasenu maapai
kroththaga prathi dhinamu yaesu prabhoa

5. mana aathmanujeevamu dhaehamunu
mana prabhuyaesu raakadavaraku
vosaruga kaapaadunu padhilamugaa
dhina dhinamunu niMdhaarahithamug

6. thMdrikumaara shudhDhaathmakunu
thara tharamulaku mahima ghanath
paripoorNamugaa prabalunu gaak
paripari viDhamula prabhu sMghamuloa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com