• waytochurch.com logo
Song # 3342

gaayamulan gaayamulan naa korakai pomdhenu kreesthu prabhuగాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు



Reference: మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను. యెషయా Isaiah 53:5

పల్లవి: గాయములన్ గాయములన్ - నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు

1. సురూపమైన సొగసైన లేదు - దుఃఖ భరితుడాయెను
వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ - వీక్షించి త్రిప్పిరి ముఖముల్

2. మా రోగములను మా దుఃఖములను - మనకై తానే భరియించె
మొత్తబడెను బాధించబడెను - యెంతో శ్రమనొందె మనకై

3. మా అతిక్రమ క్రియలను బట్టి - మరి నలుగగొట్టబడెను
తాను పొందిన దెబ్బలద్వారా - స్వస్థత కలిగె మనకు

4. పాపంబు కపటంబు లేదు ప్రభునందు - మౌనము వహియించె మనకై
ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించె - ప్రభువే ఘోర సిలువపై

5. క్రీస్తు ప్రేమను మరువజాలము - యెంతో ప్రేమించె మనల
సిలువపై మేము గమనించ మాకు - విలువైన విడుదల గలిగె



Reference: mana yathikrama kriyalanubatti athadu gaayaparachabadenu. yeShyaa Isaiah 53:5

Chorus: gaayamulan gaayamulan - naa korakai poMdhenu kreesthu prabhu

1. suroopamaina sogasaina laedhu - dhuHkha bharithudaayenu
vyaaDhigrasthudugaa vyaakulamoMdhen - veekShiMchi thrippiri mukhamul

2. maa roagamulanu maa dhuHkhamulanu - manakai thaanae bhariyiMche
moththabadenu baaDhiMchabadenu - yeMthoa shramanoMdhe manakai

3. maa athikrama kriyalanu batti - mari nalugagottabadenu
thaanu poMdhina dhebbaladhvaaraa - svasThatha kalige manaku

4. paapMbu kapatMbu laedhu prabhunMdhu - maunamu vahiyiMche manakai
praaNMbu manakai priyamugaa narpiMche - prabhuvae ghoara siluvapai

5. kreesthu praemanu maruvajaalamu - yeMthoa praemiMche manal
siluvapai maemu gamaniMcha maaku - viluvaina vidudhala galige



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com