దేవాది దేవుని భూజనులారా
dhaevaadhi dhaevuni bhoojanulaaraa
Reference: దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తన Psalm 136:2
పల్లవి: దేవాది దేవుని భూజనులారా - రండి స్తుతించ సదా
1. కరుణ కృపా ప్రేమ - మయుడైన దేవుడు
వరుసగ మనకన్ని - దయ చేయువాడు
2. వదలక అడుగుది - ఈయంబడు ననెన్
వెదకుడి తట్టుడి - తీయంబడు ననెన్
3. యేసుని పేరట - వేడిన దానిని
దాసుల కిడును - దేవుడు వేగమే
4. సుతుని ఇచ్చినవాడు - కొరత గానీయడు
ప్రేతిగా సమస్తము - నిచ్చును దయతో
5. సత్యమునందు - మనల నడిపించను
నిత్యాత్మను శాశ్వతముగా నెచ్చెను
6. ప్రాకటముగా నల్లెలూయ పాడుటకు
సకల మానవులు నిరతము స్తుతింపను
Reference: dhaevadhaevuniki kruthajnYthaasthuthulu chelliMchudi. keerthana Psalm 136:2
Chorus: dhaevaadhi dhaevuni bhoojanulaaraa - rMdi sthuthiMcha sadhaa
1. karuNa krupaa praema - mayudaina dhaevudu
varusaga manakanni - dhaya chaeyuvaadu
2. vadhalaka adugudhi - eeyMbadu nanen
vedhakudi thattudi - theeyMbadu nanen
3. yaesuni paerata - vaedina dhaanini
dhaasula kidunu - dhaevudu vaegamae
4. suthuni ichchinavaadu - koratha gaaneeyadu
praethigaa samasthamu - nichchunu dhayathoa
5. sathyamunMdhu - manala nadipiMchanu
nithyaathmanu shaashvathamugaa nechchenu
6. praakatamugaa nallelooya paadutaku
sakala maanavulu nirathamu sthuthiMpanu