anudhinamu maa bhaaramuఅనుదినము మా భారము
Reference: ప్రభువు స్తుతినొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు. కీర్తన Psalm 68:19
పల్లవి: అనుదినము మా భారము - భరించే దేవా
అనిశము నీ మేళ్ళతో - నింపుచున్నావు
1. సన్నుతించు మనిశము - నా ప్రణమా యేసుని
పరిశుద్ధ నామమును - పొగడు మెప్పుడు
ఒంటె బరువు దీవెనలు - వీపున మోసె
2. నా శరీరమున ముల్లు - బాధపరచుచుండగా
వేదనతో వేడగా - ధైర్యమిచితివి
నా కృప నీ కెల్లప్పుడు - చాలునంటివి
3. అపరాధముతో మేము చిక్కుకొని యుండగా
నీ రక్తముతో మమ్ము - విమోచించితివి
నీదు కృప మహదై-శ్వర్యంబును బట్టి
4. అన్నిటిలో నెప్పుడు - సకల సంపదలతోను
సమృద్ధితో మమ్ములను - సాకుచుంటివి
కృపా క్షేమములను మాపై - కుమ్మరించితివి
5. సర్వవేళల సంతృప్తిని - నేర్పినావు మాకిల
సకలంబును చేయుటకు - శక్తి నిచ్చితివి
బలపరచుము నిన్ను బట్టి - బలుడవు దేవా
Reference: prabhuvu sthuthinoMdhunu gaaka. anudhinamu aayana maa bhaaramu bhariMchuchunnaadu. dhaevudae maaku rakShNakarthayai yunnaadu. keerthana Psalm 68:19
Chorus: anudhinamu maa bhaaramu - bhariMchae dhaevaa
anishamu nee maeLLathoa - niMpuchunnaavu
1. sannuthiMchu manishamu - naa praNamaa yaesuni
parishudhDha naamamunu - pogadu meppudu
oMte baruvu dheevenalu - veepuna moase
2. naa shareeramuna mullu - baaDhaparachuchuMdagaa
vaedhanathoa vaedagaa - Dhairyamichithivi
naa krupa nee kellappudu - chaalunMtivi
3. aparaaDhamuthoa maemu chikkukoni yuMdagaa
nee rakthamuthoa mammu - vimoachiMchithivi
needhu krupa mahadhai-shvaryMbunu batti
4. annitiloa neppudu - sakala sMpadhalathoanu
samrudhDhithoa mammulanu - saakuchuMtivi
krupaa kShaemamulanu maapai - kummariMchithivi
5. sarvavaeLala sMthrupthini - naerpinaavu maakil
sakalMbunu chaeyutaku - shakthi nichchithivi
balaparachumu ninnu batti - baludavu dhaevaa