bhakthulaaraa smariyimchedhamu prabhuchaesina maelulannitiniభక్తులారా స్మరియించెదము ప్రభుచేసిన మేలులన్నిటిని
Reference: ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు. మార్కు Mark 7:37
పల్లవి: భక్తులారా స్మరియించెదము
ప్రభుచేసిన మేలులన్నిటిని
అడిగి ఊహించు వాటికన్న
మరి సర్వము చక్కగ జేసె
1. శ్రీయేసే మన శిరస్సై యుండి
మహాబలశూరుండు
సర్వము నిచ్చెను తన హస్తముతో
ఎంతో దయగల వాడు
2. గాలి తుఫానులను గద్దించి
బాధలను తొలగించే
శ్రమలలో మనకు తోడైయుండి
బయలు పరచె తన జయమున్
3. జీవ నదిని ప్రవహింపజేసె
స్థలంబులయందు
లెక్కకుమించిన ఆత్మలతెచ్చె
పభువే స్తోత్రార్హుండు
4. అపోస్తలుల, ప్రవక్తలను
సువార్తికులను యిచ్చె
సంఘము అభివృద్ధిని
చెందుటకు సేవకులందరినెచ్చె
5. మన పక్షమున తానే పోరాడి
సైతానును ఓడించె
ఇంతవరకును ఆదుకొనెనుగా
తన మహాత్మ్యము జూపె
6. ఈ భువియందు జీవించుకాలము
బ్రతికెదము ప్రభుకొరకే
మనమాయన కర్పించుకొనెదము
ఆయన ఆశయమదియే
Reference: eeyana samasthamunu baagugaa chaesiyunnaadu. maarku Mark 7:37
Chorus: bhakthulaaraa smariyiMchedhamu
prabhuchaesina maelulannitini
adigi oohiMchu vaatikann
mari sarvamu chakkaga jaese
1. shreeyaesae mana shirassai yuMdi
mahaabalashooruMdu
sarvamu nichchenu thana hasthamuthoa
eMthoa dhayagala vaadu
2. gaali thuphaanulanu gadhdhiMchi
baaDhalanu tholagiMchae
shramalaloa manaku thoadaiyuMdi
bayalu parache thana jayamun
3. jeeva nadhini pravahiMpajaese
sThalMbulayMdhu
lekkakumiMchina aathmalathechche
pabhuvae sthoathraarhuMdu
4. apoasthalula, pravakthalanu
suvaarthikulanu yichche
sMghamu abhivrudhDhini
cheMdhutaku saevakulMdharinechche
5. mana pakShmuna thaanae poaraadi
saithaanunu oadiMche
iMthavarakunu aadhukonenugaa
thana mahaathmyamu joope
6. ee bhuviyMdhu jeeviMchukaalamu
brathikedhamu prabhukorakae
manamaayana karpiMchukonedhamu
aayana aashayamadhiyae